భర్త చేతిలో కత్తి పెట్టి ఏమీ తెలియనట్లుగా నటించింది.. కానీ,…

by Sumithra |   ( Updated:2020-05-11 07:52:02.0  )
భర్త చేతిలో కత్తి పెట్టి ఏమీ తెలియనట్లుగా నటించింది.. కానీ,…
X

దిశ, మహబూబ్ నగర్: కష్టాలు, నష్టాలు ఎదురైనా భార్యాభర్తలు బంధాలను, అనుబంధాలను వీడనాడొద్దు… ఒకరినొకరు అర్థం చేసుకుంటూ తోడునీడలాగా ఉండాలి.. ఇదే కదా పెద్దలు చెప్పేది… వివాహ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం ఇదే. కానీ, ఇందుకు భిన్నంగా ఓ మహిళ దారుణానికి ఒడి గట్టింది. బాధలు పెడుతున్నాడని భర్తను కాటికి పంపింది ఓ భార్య. ఆపై ఏమీ తెల్వనట్టుగా బిత్తర వేషాలు వేసి ఎదుటివారిని నమ్మించాలనుకుంది. చివరికి కటకటాల పాలైంది.

నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని మంగనూరు గ్రామానికి చెందిన గంజి శ్రీనివాసులు (50) తాగుడుకు బానిసై నిత్యం భార్యతో గొడవపడేవాడు. ఈ సందర్భంలోనే అదివారం కూడా తాగి ఇంటికి వచ్చిన శ్రీనివాసులు భార్యతో గొడవపడి ఇంటి బయట నిద్రపోయాడు. భర్త వేధింపులకు విసిగిపోయిన భార్య రాత్రి కత్తితో అతని మెడను కోసి హత్య చేసింది. ఆపై ఆమె హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు భర్త చేతిలో కత్తినిపెట్టి తనకేమీ తెలియనట్టుగా ఉండిపోయింది. సోమవారం నాడు ఉదయం గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని భార్యపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఆ విచారణలో తానే తన భర్తను హత్య చేసినట్టుగా అంగీకరించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed