జ్యోతిష్యుడితో తల్లి ఎఫైర్.. సహకరించిన కుమారుడు

by Sumithra |   ( Updated:2021-06-10 07:14:27.0  )
illicit affair Businessman Murder
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రేమగా చూసుకునే భర్త.. ఏ లోటు లేకుండా సాగుతున్న కుటుంబంలోకి ఓ జ్యోతిష్యుడు ప్రవేశించి అల్లాకల్లోలం సృష్టించాడు. కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాడు. జ్యోతిష్యం చెప్పడానికి వచ్చి వాళ్ల తలరాతలనే మార్చేశాడు. ఐదేళ్ల క్రితం హత్యకు గురైన ఎన్ఆర్ఐ, పారిశ్రామిక వేత్త భాస్కర్ శెట్టి కేసులో కీలక తీర్పు ఇచ్చింది జిల్లా కోర్టు. భార్య, కుమారుడు, జ్యోతిష్యుడితోపాటు ఆయన తండ్రికి జీవిత ఖైదు విధించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కర్ణాటకకు చెందిన ఎన్ఆర్ఐ భాస్కర్ శెట్టి(52) ప్రముఖ పారిశ్రామికవేత్త. సౌదీ అరేబియాలో పలు వ్యాపారాలు చేసే భాస్కర్ శెట్టికి కర్నాటకలోని ఉడిపిలో కూడా హోటల్స్, లాడ్జీలు, ఇతర బిజినెస్‌లు ఉన్నాయి. తల్లి, భార్య, కుమారుడితో నివాసం ఉంటున్న భాస్కర్ శెట్టి ఉన్నటుండి కనిపించకుండా పోయాడు. అయినా భార్యా, కుమారుడు ఎలాంటి విచారం లేకుండా ఉన్నారు. అతడి గురించి వాకాబు కూడా చేయలేదు. దీనిపై అనుమానం వచ్చిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమారుడు కనిపించడం లేదని, తన కోడలుపైనే అనుమానం ఉన్నదని ఫిర్యాదులో పేర్కొంది. కేసు విచారణ చేపట్టిన పోలీసులు షాకింగ్ విషయాలను వెలుగులోకి తెచ్చారు.

ఎన్ఆర్ఐ భాస్కర్ శెట్టికి జ్యోతిష్యుడు నిరంజన్ భట్(29)తో పరిచయం ఉన్నది. ఆ పరిచయంతో తరుచూ భాస్కర్ శెట్టి ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో భాస్కర్ శెట్టి భార్య రాజేశ్వరి శెట్టి(46)తో నిరంజన్ శెట్టికి అక్రమ సంబంధం ఏర్పడింది. సమాజంలో పలుకుబడి, డబ్బున్న అందమైన ఆంటీ తన బుట్టలో పడిందని సంతోషించిన జ్యోతిష్యుడు.. భాస్కర్ శెట్టి బిజినెస్ టూర్లకు వెళ్లగానే రాజేశ్వరి శెట్టితో ఇంట్లోనే మకాం వేసేవాడు. ఆమె నుంచి శారీరక సుఖం పొందుతూనే భారీగా డబ్బులు గుంజడం ప్రారంభించాడు.

ఆలస్యంగా భార్య అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న భాస్కర్ శెట్టి ఆమెను మందలించాడు. పద్దతి మార్చుకోవాలని హితవు పలికాడు. కానీ భార్య.. భర్త మాటలను పెడచెవిన పెట్టి జ్యోతిష్యుడు నిరంజన్ భట్టుతో విచ్చలవిడిగా తిరిగింది. అదే సమయంలో తన కుమారుడు నవీన్ శెట్టికి భర్తపై చాడీలు చెప్పింది. మీ నాన్న మంచివాడు కాదని అబద్దాలను నూరిపోసింది. ఈ క్రమంలో భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడు నిరంజన్ శెట్టితో ప్లాన్ చేసింది. 2016 జూలై 28న భాస్కర్ శెట్టిని కుమారుడితో కలిసి దారుణంగా హత్య చేసింది. అనంతరం ప్రియుడు నిరంజన్ భట్ సాయంతో భర్త మృతదేహాన్ని యజ్ఞకుండంలో పెట్రోలు పోసి కాల్చివేశారు. ఇందుకు నిరంజన్ భట్ తండ్రి శ్రీనివాస్ భట్, డ్రైవర్ రాఘవేంద్ర కూడా సహకరించాడు.

ఈ కేసును విచారించిన ఉడిపి జిల్లా సెషన్స్‌కోర్డు జడ్జి జేఎన్ సుబ్రమణ్య తీర్పునిచ్చారు. రాజేశ్వరి, నవనీత్ శెట్టి, నిరంజన్‌భట్‌లకు జీవతఖైదు విధించారు. డ్రైవర్‌ రాఘవేంద్రపై ఆధారాలు లేకపోవడంతో విముక్తున్ని చేశారు. ఈ కేసులో నాలుగో నిందితుడు విచారణ జరుగుతున్న సమయంలోనే అనారోగ్యంతో మృతిచెందాడు. ఇక, ఈ కేసులో ప్రధాన నిందితురాలైన రాజేశ్వరి ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉండగా.. నవనీత్ శెట్టి, నిరంజన్‌భట్‌లు బెంగళూరు జైలులో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed