భర్త చేతిలో హత్యకు గురైన భార్య

by Sumithra |   ( Updated:2021-08-23 04:22:40.0  )
భర్త చేతిలో హత్యకు గురైన భార్య
X

దిశ, భువనగిరి రూరల్: యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భర్త అక్రమ సంబంధాన్ని గురించి నిలదీసినందుకు అతని చేతిలో భార్య హత్యకు గురైంది. భువనగిరి పట్టణంలోని అర్బన్ కాలనీలో ఒకటో వార్డులో నివాసముంటున్న వెంకటాచారి, లక్ష్మి అనే దంపతులకు ఇద్దరు సంతానం. అయితే తాగుడుకు బానిసైన వెంకటాచారి వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని తరుచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ విషయంమై ఆదివారం రోజు మధ్యరాత్రి ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరగడంతో మద్యం మత్తులో ఉన్న వెంకటాచారి భార్య గొంతు నులిమి చంపాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story