భార్యను గొంతునులిమి చంపిన భర్త

by Sumithra |
భార్యను గొంతునులిమి చంపిన భర్త
X

దిశ, చేర్యాల: సిద్దిపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్యను గొంతు నులిమి దారుణంగా చంపాడు భర్త. కొమురవెల్లి మండలం రాంసాగర్‌లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ నరేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రామ్‌సాగర్ గ్రామంలోని తాడూరి బాలయ్యకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురు యాదమ్మను చేర్యాల నివాసి చుంచు స్వామితో 25 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరికి కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. స్వామి హమాలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

గతకొంత కాలంగా స్వామి పలువురితో అక్రమ సంబంధాలు ఏర్పరుచుకుని యాదమ్మను హింసించడం మొదలుపెట్టాడు. దీంతో యాదమ్మ భర్తతో విభేదించి పుట్టింటికి చేరింది. నెలరోజుల క్రితం యాదమ్మ‌ను నమ్మబలికి బుద్ధిగా నడుచుకుంటానని చెప్పి స్వామి అత్తగారి ఇంట్లో ఉండిపోయాడు. ఈ క్రమంలో యాదమ్మ తల్లిదండ్రులు చిన్నకూతురు ఇంటికి వెళ్లడంతో తన అక్రమ సంబంధాలకు అడ్డు తొలగించుకోవాలని పథకం ప్రకారం ఆదివారం యాదమ్మను హత్య చేశాడు. ఈ ఘటనపై మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story