మద్యం మత్తులో హతమైన భర్త.. భార్య ఏం చెప్పిందో తెలుసా..!

by Sridhar Babu |
మద్యం మత్తులో హతమైన భర్త.. భార్య ఏం చెప్పిందో తెలుసా..!
X

దిశ, కాటారం : మద్యం మత్తులో ఇంటికి వచ్చిన భర్త రాత్రికి రాత్రే మంచంలో విగతజీవిగా పడి ఉన్నాడు. మెడ భాగంలో గాయమై తీవ్ర రక్తస్రావంతో మృతి చెందాడు. దీనిపై పోలీసులు వివరణ కోరగా అనుకోకుండా గొడ్డలి గుచ్చుకుని తన భర్త మృతిచెందాడని భర్త వాంగ్మూలం ఇచ్చింది. వివరాల్లోకివెళితే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండలం కొర్లకుంట గ్రామం శ్రీపాద కాలనీ నలుబోతుల కిష్టయ్య(38) దంపతులు ఉంటున్నారు.

కిష్టయ్య రోజూ మద్యం తాగి ఇంటికి వచ్చేవాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భార్యపై గొడ్డలితో దాడి చేసేందుకు భర్త రాగా ఇద్దరి మధ్య పెనుగులాట చోటుచేసుకుంది. చివరగా ఒకరిపై ఒకరు పడటంతో గొంతుకు గొడ్డలి గుచ్చుకొని చనిపోయినట్లు మృతుడి భార్య నలుబోతుల చంద్రకళ పోలీసులకు వివరించింది. ఇదిలాఉండగా, పెనుగులాట అనంతరం నిద్రిస్తున్న భర్తను క్షణికావేశంలోచంద్రకళే హత్య చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story