- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్య
దిశ, దుబ్బాక: అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఒకవైపు.. రైతు బీమా వస్తదన్న ఆశ మరోవైపు.. ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన సంఘటన దుంపలపల్లిలో చోటు చేసుకుంది. ఏడడుగులు నడిచి, మూడుముళ్లు వేసుకున్న భర్తతో జీవించాల్సిన భార్య ఇంటి పక్కనున్న ప్రియుడిని ఉసిగొలిపి భర్తను మద్యం మత్తులో చంపించి ప్రియుడితో సహా కటకటాల పాలైంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం దుంపలపల్లి గ్రామనికి చెందిన రెడ్డయ్య అనే గొర్రెల కాపరి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే హత్యను మూడు రోజుల్లో దుబ్బాక పోలీసులు చేదించారు. హంతకులను పట్టుకొని శనివారం మీడియా ముందు ఉంచారు.
ఈ సందర్భంగా సిద్దిపేట ఇంచార్జ్ ఏసిపి సైదులు మాట్లాడుతూ.. దుంపలపల్లి గ్రామ శివారులో అనోన్ డెడ్ బాడీ ఉందంటూ గ్రామస్తులు సమాచారమిచ్చారని, వెంటనే సిబ్బందితో కలిసి క్లూస్ టీమ్ డాగ్ స్కాడ్‌తో కలిసి వివరాలు సేకరించడం జరిగిందని తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు గ్రామానికి చెందిన అఫ్రోజ్‌ను మృతుని భార్య తిరుపతవ్వను అదుపులోకి తీసుకొని విచారించగా.. అఫ్రోజ్ రెడ్డయ్య భార్య తిరుపతవ్వకు అక్రమ సంబంధం ఉన్న కారణంగా తమకు అడ్డు రాకుండా ఉండేందుకు హత్య చేసినట్లు వెల్లడించారు.
గత ఆరు నెలల నుండి అఫ్రోజ్, తిరుపతవ్వకు అక్రమ సంబంధం కొనసాగుతుందుని, ఈ నేపథ్యంలోనే తమ జల్సాలకు డబ్బులు లేకపోవడంతో రెడ్డయ్యను చంపితే రైతు బీమా పథకం ద్వారా రూ.5 లక్షలు వస్తాయనే ఆశతో ఈ హత్యకు పాల్పడినట్లు ఏసిపి తెలిపారు. రెడ్డయ్యను చంపితే వచ్చే రైతు బీమా రూ.5 లక్షలతో జల్సాలు చేయవచ్చని ఒక పథకం ప్రకారం హత్య చేశారని చెప్పారు. హత్య జరిగిన రోజున ఫంక్షన్ ఉందని తన పుట్టిన ఊరికి వెళ్లి అక్కడ నుండి అఫ్రోజ్ కు తిరుపతవ్వ ఫోన్ చేస్తూ ఇదే సమయం నేను ఊర్లో లేను నా భర్త రెడ్డయ్యను చంపాలంటూ ఉసిగొల్పడంతో రెడ్డయ్యను అఫ్రోజ్ బైక్ పై ఎక్కించుకుని దుబ్బాకకు తీసుకువచ్చి ఓ వైన్ షాప్ లో మద్యం తీసుకొని దుంపలపల్లి గ్రామ శివారులో మట్టి రోడ్డుపై కూర్చోబెట్టి రెడ్డయ్య కు ఎక్కువ మందు తాగించి మద్యం మత్తులో ఉన్న రెడ్డయ్యను టవాల్ తో మెడకు చుట్టి చంపేసినట్లు విచారణలో అంగీకరించారు.
A1గా అఫ్రోజ్, A2గా తిరుపతవ్వలను నేరస్తులుగా భావిస్తూ రిమాండ్ కు తరలించారు. రెడ్డయ్య, తిరుపతవ్వ లకు ఐదుగురు ఆడ సంతానం అందులో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వారిని చూసి గ్రామస్థులు కంటతడి పెట్టారు. ఓ అక్రమ సంబంధం, డబ్బుపై మోజుతో ఇంత దారుణానికి ఒడిగట్టిందంటే సమాజం లో ఇంకా ఏ విధమైన మనుషులు ఉంటారో చెప్పకనే చెప్పవచ్చు.
- Tags
- husband