కట్నం కోసం కిడ్నాప్.. ఆపై అత్యాచారం

by Anukaran |   ( Updated:2020-08-01 10:22:22.0  )
కట్నం కోసం కిడ్నాప్.. ఆపై అత్యాచారం
X

దిశ, వెబ్ డెస్క్: అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యను కిడ్నాప్ చేశాడు ఓ ప్రభుద్దుడు. అంతటితో ఆగకుండా తన ముగ్గురు స్నేహితులతో కలిసి సమూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘోర ఘటన యూపీలోని ఫిలిబిత్ లో చోటుచేసుకుంది. ఈ షాక్ నుంచి తేరుకున్న ఆమె చేసేదిలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్‌లో ప్రభుత్వ అంబులెన్స్ విభాగంలో పనిచేస్తున్నాడు ఓ వ్యక్తి. అతనికి 2016లో అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో వివాహం జరిగింది. కొన్నాళ్లు సంసారం సజావుగా సాగింది. కొన్ని రోజుల తరువాత అదనపు కట్నం కోసం ఆమెను హింసించడం మొదలుపెట్టాడు. దీంతో చిత్రహింసలు భరించలేక 2018 నుంచి భర్తకు దూరంగా ఉంటోంది. అయితే ఇటీవలే పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో మళ్లీ ఇద్దరూ కలిశారు. అయితే భర్త మరోసారి అదనపు కట్నం కోసం భార్యను కిడ్నాప్ చేసి తన ముగ్గురు స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడు. తరువాత సమీపంలోని రైల్వే ట్రాక్ దగ్గర వదిలేశాడు. ఈ ఘటనతో షాక్ గురైన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె భర్తతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story