భార్య ఏమైనా బానిసనా..? సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

by Sumithra |
భార్య ఏమైనా బానిసనా..? సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: కట్టుకున్న భార్య తన భర్తకు బానిస కాదని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఒక వ్యక్తి తన భార్యతో సంబంధం తెంచుకుని, తిరిగి జీవించాలనే విధంగా కోర్టు ఆదేశాలు జారీ చేయాలని కోరడంపై స్పందిస్తూ కోర్టు పై విధంగా స్పందించింది. వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన వ్యక్తికి 2013లో పెళ్లి అయింది. కానీ భర్త తరుచూ తనను కట్నం కోసం వేధిస్తున్నాడని, ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలని అంటున్నాడని ఆరోపిస్తూ 2015లో ఆమె అతడిపై కేసు పెట్టింది.

దీంతో స్థానిక కోర్టు ఆమెకు నెలకు రూ. 20 వేల భరణం చెల్లించాల్సిందిగా సదరు భర్తను ఆదేశించింది. దీనిని సవాల్ చేస్తూ.. తనకు సంయోగ హక్కులను పునరుద్ధరించాలని అతడు కుటుంబన్యాయస్థానంలో కేసు వేశాడు. కోర్టు ఇందుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. సంయోగ హక్కులు పునరుద్దరించిన తర్వాత ఆమె తనతో కలిసి జీవించడానికి సుముఖంగా ఉన్నప్పుడు నెల నెలా నిర్వహణ ఖర్చులెందుకు చెల్లించాలని అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఆమెను తనతో కలిసి జీవించేవిధంగా ఆదేశాలు జారీ చేయాలని అతడు కోరాడు.

దీనిపై సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ.. ‘మీరు ఏమనుకుంటున్నారు..? మహిళ బానిసనా..? భార్య ఏమైనా బానిసనా..? ఆమెకు ఇష్టంలేని చోట ఉండమని మీరు మమ్మల్ని ఉత్తర్వులు జారీ చేయమంటున్నారు’ అని ప్రశ్నించింది.

Advertisement

Next Story