- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భర్తను హత్య చేసినా ఫ్యామిలీ పెన్షన్‌కు అర్హురాలే
చండీగఢ్: పంజాబ్, హర్యానా హైకోర్టు వెలువరించిన తీర్పు చర్చనీయాంశంగా మారింది. భర్తను హతమార్చినప్పటికీ ఫ్యామిలీ పెన్షన్‌కు భార్య అర్హురాలేనని తీర్పునిచ్చింది. ‘బంగారు గుడ్లు పెట్టే కోడిపెట్టను ఎవరూ చంపరు. భర్తను చంపినా ఫ్యామిలీ పెన్షన్ తీసుకునే హక్కును ఆయన భార్య నుంచి దూరం చేయరాదు. ప్రభుత్వోద్యోగి మరణిస్తే ఆయన కుటుంబానికి ఆర్థిక దన్ను కోసం ప్రభుత్వం ఫ్యామిలీ పెన్షన్ ప్రవేశపెట్టింది. ఆమె ఈ నేరపూరిత కేసులో దోషిగా తేలినా పెన్షన్‌కు అర్హురాలే’ అని ఈ నెల 25న పంజాబ్, హర్యానా హైకోర్టు తీర్పునిచ్చింది. హర్యానా ప్రభుత్వోద్యోగి అయిన తన భర్త 2008లో మరణించాడని పేర్కొంటూ బాల్జీత్ కౌర్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ ఈ తీర్పు వెలువరించింది. 2009లో ఆమెపై కేసు నమోదవ్వగా, 2011లో భర్తను హతమార్చినట్టు కౌర్ దోషిగా తేలారు. దోషిగా తేలగానే పెన్షన్ ఆపేస్తూ హర్యానా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాజాగా, కౌర్‌కు అనుకూలంగా హైకోర్టు తీర్పునిస్తూ పెండింగ్ పెన్షన్‌లనూ అందివ్వాలని ఆదేశించింది.