మద్యం మత్తులో డ్రైవింగ్.. వారి చావుకు కారణమైన కుటుంబ పెద్ద..

by Shyam |
acciedent
X

దిశ, గుమ్మడిదల: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రానికి చెందిన కమ్మరి బ్రహ్మచారి, భార్య పిల్లలతో కలిసి వీరంతా బొల్లారంలో ఒక శుభకార్యానికి వెళ్తున్నారు. వీరంతా ద్విచక్ర వాహనం మీద వెళ్తున్న క్రమంలో భర్త బ్రహ్మచారి మద్యం సేవించి ఉండడంతో దోమడుగు గ్రామపంచాయతీ సమీపంలో బండి అదుపుతప్పి కిందపడడంతో గాయాలయ్యాయి. దీంతో వారందరూ అన్నారంలోని ఓ క్లీనిక్‌లో చికిత్స పొంది తిరిగి గుమ్మడిదలలోని నివాసానికి ప్రయాణమయ్యారు. తిరిగి వస్తున్న క్రమంలో దోమడుగు గ్రామ మూల మలుపు వద్ద రోడ్డుకు ఎడమ వైపు ఉన్న ఇనుప రైలింగ్‌ను ఢీకొనడంతో భార్య కల్పన, కూతురు కృతిక శివాని, కొడుకు కార్తీక్, బ్రహ్మచారి‌లకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే వారందరినీ నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే భార్య కల్పన, కూతురు కృతిక మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కార్తీక్, బ్రహ్మచారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కల్పన తండ్రి శంకరయ్య చారి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విజయ్ కృష్ణ తెలిపారు.

Advertisement

Next Story