- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భర్త నిద్రపోతుండగా.. భార్య ఘోరం
దిశ, వెబ్‌డెస్క్: భర్త వేధింపులు తాళలేని ఓ భార్య దారుణానికి ఒడిగట్టింది. నిద్రిస్తున్న భర్తపై యాసిడ్ పోసి అనంతరం కొడుకుతో సహా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కేరళలో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. తిరువనంతపురముకు రేజిలాల్, బిందు భార్యభర్తలు. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇక వివాహం అయిన కొద్దిరోజులు బాగున్నా వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. భర్త రేజిలాల్, భార్యను వేధించడం మొదలుపెట్టాడు. నిత్యం మద్యం తాగి వచ్చి ఆమెను శారీరకంగా వేధించేవాడు. దీంతో రోజూ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలోనే ఆదివారం కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భార్యతో గొడవపడి రేజిలాల్ నిద్రపోయాడు.
ఇక భర్త వేధింపులు తాళలేని బిందు గాఢ నిద్రలో ఉన్న భర్తపై యాసిడ్ దాడి చేసింది. వెంటనే కుమారుడితో పారిపోయి సమీపంలో ఉన్న బావిలో కుమారుడిని తోసేసి తాను ఆత్మహత్య చేసుకున్నది. యాసిడ్ మంటకు తట్టుకోలేక రేజిలాల్ అరిచిన అరుపులు విన్న స్థానికులు అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సోమవారం సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బావిలో నుంచి బిందు, కుమారుడు మృతదేహాలను వెలికితీసి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.