తెలంగాణలో విస్తారంగా వర్షాలు

by Shyam |
తెలంగాణలో విస్తారంగా వర్షాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర, తూర్పు తెలంగాణలోని జిల్లాలపై అధికంగా అల్పపీడన ప్రభావం చూపనుంది. అలాగే, రాష్ట్రంలో ఈ రోజు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతోనే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. ఇక ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

Advertisement

Next Story