క్షమాపణలు చెప్పిన పొలార్డ్.. ఎందుకో తెలుసా..?

by Shiva |   ( Updated:2021-03-11 09:19:17.0  )
క్షమాపణలు చెప్పిన పొలార్డ్.. ఎందుకో తెలుసా..?
X

దిశ, స్పోర్ట్స్ : వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో శ్రీలంక క్రికెటర్‌ను థర్డ్ అంపైర్ ‘అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ నియమం పేరుతో అవుట్ ప్రకటించడం ప్రస్తుతం వివాదంగా మారింది. బుధవారం రాత్రి శ్రీలంక, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి వన్డే జరిగింది. లంక తొలుత బ్యాటింగ్ చేసే సమయంలో పొలార్డ్ వేసిన 21.1 బంతికి ఓపెనర్ గుణతిలక డిఫెన్స్ ఆడాడు. బంతి అక్కడే పడినా పరుగు కోసం ముందుకు వచ్చాడు. నాన్ స్ట్రైకర్ పరుగు వద్దని వారించడంతో గుణతిలక వెనుకకు అడుగులు వేశాడు. ఈ క్రమంలో చూసుకోకుండా కాలితో బంతిని తన్నాడు. దీంతో పొలార్డ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ అంపైర్లకు అప్పీల్ చేశాడు. ఫీల్డ్ అంపైర్లు టీవీ అంపైర్‌కు అప్పీల్ చేశాడు. కాగా, వీడియోలో గుణతిలక చూడకుండా తగిలినట్లు కనపడిగా అవుట్‌గా ప్రకటించారు. అప్పటికే అర్దశతకం పూర్తి చేసుకున్న గుణతిలక ఇలా ఔటవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత మాజీ స్పిన్నర్ హర్బజన్ సింగ్ కూడా దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. ఇది ఎలా అవుటో ఐసీసీ చెప్పాలని డిమాండ్ చేశాడు. వెస్టిండీస్ ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం గుణతిలక వద్దకు వెళ్లిన పొలార్డ్ క్షమాపణ చెప్పడం కొసమెరుపు.

Advertisement

Next Story

Most Viewed