- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమరావతికి లేదు.. మరి ఉక్కు ఉద్యమానికే ఎందుకు?
దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్సీ ఎన్నికల క్రమంలో విశాఖ ఉక్కు ఉద్యమానికి తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మద్దతు తెలపడం టీ పాలిటిక్స్‌లో దుమారం రేగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సెటిలర్ల ఓట్ల కోసమే కేటీఆర్ విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతిచ్చారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. విశాఖ ఉక్కు మద్దమానికి మద్దతిచ్చిన కేటీఆర్.. అమరావతి రైతుల ఉద్యమానికి ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నాయి.
అమరావతి శంకుస్థాపనకు నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ వెళ్లి తెలంగాణ రాష్ట్రం, ప్రజల తరపున ఆశిస్సులు అందించారు. అలాంటప్పుడు అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు.
ఇక కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్న ఉద్యమానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎందుకు సపోర్ట్ చేయలేదని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే.. కేటీఆర్ డ్రామాలు ఆడుతున్నారని రాజకీయ వర్గాలు విమర్శిస్తున్నాయి.