కరోనా ఒత్తిడిని తరిమికొట్టే ‘క్వారంటైన్ బబుల్’

by  |
కరోనా ఒత్తిడిని తరిమికొట్టే ‘క్వారంటైన్ బబుల్’
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. వైరస్ ఉధృతికి ప్రపంచ దేశాలన్నీ కూడా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో బయటకెళ్లే మార్గం లేదు. స్నేహితులను కలిసే చాన్స్ లేదు. పార్టీలు, పబ్‌లు అసలే లేవు. ఓ వైపు కొవిడ్ భయం.. మరో వైపు సెల్ఫ్ హోం క్వారంటైన్. ఈ క్రమంలో చిన్నారులు, పెద్దలు అందరూ ఒత్తిడికి గురవుతున్నారని పలు సర్వేలు వెల్లడించాయి. ముఖ్యంగా యూత్ శారీరకంగా, మానసికంగా తీవ్రంగా డిప్రెషన్‌లోకి వెళ్తున్నారని వెల్లడైంది. అయితే ఈ ఒత్తిడి నుంచి బయటపడటానికి, మనసు ప్రశాంతంగా ఉండటానికి మనకు ఒకరి తోడు ముఖ్యం. అందుకే ఇప్పుడు అమెరికా సహా కొన్ని దేశాల్లో కొత్త ట్రెండ్ మొదలైంది. అదే ‘క్వారంటైన్ టీమ్స్’, ‘క్వారంటైన్ బబుల్స్’, ‘పాండమిక్ పాడ్స్’.

ఎమోషనల్, సోషల్ నీడ్స్ కోసం ఏర్పాటైన క్వారంటైన్ బబుల్స్ సూపర్ సక్సెస్ అయినట్లు పరిశోధనల్లో వెల్లడైంది. ఎందుకంటే.. తరుచుగా ఒకే పార్క్‌కు గానీ, ప్రదేశానికి గానీ వాకింగ్‌కు వెళితే.. అక్కడ తమకంటూ ఓ గ్రూప్ ఏర్పడుతుంది. ఇదే తరహాలో పొలిటికల్ విషయాలు చర్చించుకునే బ్యాచ్, టీ కొట్టు బ్యాచ్.. ఇలా చాలానే ఉంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే.. మన అభిరుచికి దగ్గరగా ఉండేవాళ్లతోనే ఒక జట్టుగా ఏర్పడుతాం. ఇదే విధంగా.. క్వారంటైన్ బబుల్స్‌లో కూడా ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఒకే ఫ్యామిలీ మెంబర్స్, వెల్ విషర్స్ ఇలా ఎవరైనా సరే.. వాళ్లంతా కలిసి ఓ గ్రూప్‌గా ఏర్పడి, ఉమ్మడిగా క్వారంటైన్‌ను పాటించడాన్నే ‘క్వారంటైన్‌ బబుల్‌’ అని పిలుస్తున్నారు. దీని వల్ల వాళ్లంతా హ్యాపీగా ఉంటున్నారు. కొందరు ఒకే చోట ఉంటుండగా, మరికొంతమంది మాత్రం.. తరుచుగా కలుస్తూ తమ భావాలను పంచుకుంటున్నారు.

కరోనా ఉన్నవాళ్లంతా కూడా ఓ గ్రూప్‌గా ఫామ్ అవుతున్నారు. ఇక క్వారంటైన్ బబుల్స్‌లో ఉన్నవారంతా తప్పనిసరిగా మాస్క్‌లు ధరిస్తారు. సోషల్ డిస్టెన్స్ మస్ట్‌గా పాటిస్తారు. శానిటైజేషన్ విషయంలోనూ అస్సలు కాంప్రమైజ్ కారు. గ్రూపులో ఉన్నా, బయటకెళ్లినా, ఆఫీసుకు వెళ్లినా.. గ్రూపు నిబంధనలు పాటించాలి (మాస్క్, సోషల్ డిస్టెన్స్, శానిటైజేషన్). ఆ గ్రూపులో ఎవరికైనా కరోనా వస్తే.. అందరూ విధిగా క్వారంటైన్‌లో ఉండాలి.

ఈ క్వారంటైన్‌ బబుల్‌ వల్ల.. అందరిలోనూ పాజిటివ్ వైబ్స్ పెరుగుతాయని, ఒకరికొకరు తోడున్నామనే భావనతో ఒత్తిడి దరిచేరదని వైద్యులు చెబుతున్నారు. కరోనా భయం కానీ, తమకేమైనా అవుతుందనే భయం కానీ లేకుండా.. సంతోషంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అందరితో ఇంటరాక్షన్ ఏర్పడటం వల్ల.. సైకాలాజికల్‌గా, బయోలాజికల్‌గా మన హెల్త్, బిహేవియర్‌పై ప్రభావం ఏర్పడుతుందని అందువల్లే ఈ క్వారంటైన్ బబుల్స్ కానీ, క్వారంటైన్ టీమ్స్ ట్రెండ్ కానీ బాగా సక్సెస్ అవుతుందని వైద్యులు అంటున్నారు. క్వాలిటీ లైఫ్, సోషల్ వెల్ బీయింగ్ వల్ల ఈ క్వారంటైన్ బబుల్స్ పెరుగుతాయని అంటున్నారు. ఇలా ఉండటం వల్ల.. కొవిడ్ రిస్క్ వచ్చే చాన్స్ కూడా తక్కువగా ఉంటుందని వైద్యులు, పరిశోధకులు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. అమెరికాలో లాక్‌డౌన్‌ కారణంగా 13.6 శాతం మంది ప్రజలు మానసిక ఒత్తిడి గురవుతున్నట్లు ఓ సర్వేలో తేలింది. వారిలో 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్కులే ఎక్కువగా ఉండటం విశేషం.


Next Story

Most Viewed