నిరసనలు ప్రజాస్వామ్యంలో ఒక భాగం: ఆంటోనీ బ్లింకెన్

by Disha Web Desk 17 |
నిరసనలు ప్రజాస్వామ్యంలో ఒక భాగం: ఆంటోనీ బ్లింకెన్
X

దిశ, నేషనల్ బ్యూరో: చైనా పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. మిడిల్‌ఈస్ట్‌లో జరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో కొంతమంది చేపడుతున్న నిరసనలు ప్రజాస్వామ్యంలో ఒక భాగమని అన్నారు. ఇజ్రాయిల్-హామాస్ యుద్ధాన్ని ఆపాలని విశ్వవిద్యాలయాల్లో కొంతమంది నిరసనలు చేపట్టగా నిరసనకారులను చెదరగొట్టడానికి కొన్నిసార్లు రసాయనాలు, టేజర్‌లను ఉపయోగిస్తారు. ఈ నిరసనలు చేపట్టిన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అయితే ఇటువంటి నిరసనలు "మన ప్రజాస్వామ్యం లక్షణం" అని చైనాలో ఒక సమావేశంలో బ్లింకెన్ అన్నారు.

మా పౌరులు తమ అభిప్రాయాలు, వారి ఆందోళనలను, వారి కోపాన్ని ఏ సమయంలోనైనా తెలియజేస్తారు, ఇది దేశ బలాన్ని ప్రతిబింబిస్తుందని నేను భావిస్తున్నాను అని బ్లింకెన్ చైనాలో చెప్పారు. ఇజ్రాయిల్-హామాస్ యుద్ధం గురించి మాట్లాడుతూ, ఇంతకు ముందు చెప్పినట్లుగా హామాస్ తన ఆయుధాలను విడిచి, పౌరుల వెనుక దాక్కోవడం మానేసి, ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టినట్లయితే అసలు ఈ యుద్ధం ఎప్పుడో ముగిసిపోయేది, కానీ హామాస్ అలా చేయకూడదని నిర్ణయించుకుందని అన్నారు.



Next Story

Most Viewed