నటుడితో సోనాక్షి తల్లే ఆ పని చేయించిందా.. బయటపడ్డ అసలు నిజాలు

by Disha Web Desk 6 |
నటుడితో సోనాక్షి తల్లే ఆ పని చేయించిందా.. బయటపడ్డ అసలు నిజాలు
X

దిశ, సినిమా: ఇటీవల కాలంలో చాలా మంది బోల్డ్, ఇంటిమేటెడ్ సీన్స్ అని చూడకుండా ఏదైనా సరే అన్నట్లు చేస్తూ షాక్‌కు గురి చేస్తున్నారు. ఒకప్పుడు చాలా మంది బోల్డ్, రొమాంటిక్ సీన్స్‌లో నటించడానికి నిరాకరించేవారు. కానీ ఇప్పుడు చిన్న హీరోయిన్స్, హీరోల కానుండి స్టార్స్ సైతం అన్నింటికి ఓకే చెప్తున్నారు. అయితే ఇటీవల వచ్చిన ‘హీరామండి’ సినిమాలో ఇంటిమేటెడ్ సీన్స్ చేయడానికి నటుడు ఇంద్రేష్ మాలిక్ భయపడినట్లు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

అసలు విషయంలోకి వెళితే.. బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో సోనాక్షి సిన్హా, మనీషా కోయిరాలా, అదితి రావు హైదరి, రిచా చద్దా, షర్మిన్ సైగల్, సంజీదా షేక్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. అయితే ఇందులో నటుడు ఇంద్రేష్ మాలిక్ కూడా ఓ పాత్రలో నటించి మెప్పించాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా.. షూటింగ్ సమయంలో జరిగిన ఓ సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. ‘‘ సోనాక్షితో నాకు ఇంటిమేట్ సీన్ ఉంది. షూటింగ్ సమయంలో నేను చాలా భయపడ్డాను. కొంచెం సిగ్గు పడ్డాను కూడా. నా నెర్వస్‌నెస్ చూసి సోనాక్షి దగ్గరకు వచ్చి ఏం కాదు రిలాక్స్‌గా చేయండి అని చెప్పింది. అయితే ఆ షూట్ చేసేటప్పుడు సోనాక్షి తల్లి పూనమ్ సిన్హా కూడా అక్కడే ఉన్నారు.

దీంతో ఈ కథకు ఆ సీన్ చాలా అవసరం కాబట్టి మీరు కంగారు పడకండి అని ఆమె నాతో అన్నారు. అయితే ఒక గంట మొత్తం చర్చించి షూటింగ్ కంప్లీట్ చేశాం. అలాగే సోనాక్షి నా తలను ఆమె కాళ్లకు టచ్ చేసే సీన్ కూడా ఎంతో భయంగా చేశాను. అప్పుడు పూనమ్ సిన్హా నా దగ్గరకు వచ్చి నాకు ధైర్యం చెప్పి మరీ దగ్గరుండి చేయించారు. హీరామండిలోని నా పాత్ర కోసం నేను చాలా కష్టపడ్డాను. మొత్తానికి ప్రేక్షకులను మెప్పించానని అనుకుంటున్నాను’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నటుడి కామెంట్స్ వైరల్ అవుతుండగా తల్లే అలాంటి సీన్స్ దగ్గరుండి మరీ చేపించిందా? అని ఆశ్చర్యపోతున్నారు.

Next Story

Most Viewed