సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి రాత్రి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి అని పక్కింటి వ్యక్తి కంప్లైంట్

by Dishafeatures1 |
సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి రాత్రి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి అని పక్కింటి వ్యక్తి కంప్లైంట్
X

దిశ, ఫీచర్స్: క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్‌గా పిలుచుకునే సచ్చిన్ టెండూల్కర్‌కు తన పక్కింటి వ్యక్తి దిలీప్ డిసౌజా ముంబైలోని సచిన్ టెండూల్కర్ బాంద్రా ఇంటి లోపల పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి, అవి రాత్రి 9 గంటలైనా ఆగడం లేదని ఎక్స్(X) ద్వారా కంప్లయింట్ చేశాడు.

రాత్రి సమయంలో సిమెంట్‌ మిక్సింగ్‌ వాహనాలతో ఇబ్బంది అవుతుందంటూ తాను ఎదుర్కొంటున్న సమస్యను సచిన్‌ను ట్యాగ్‌ చేస్తూ డిసౌజా సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాడు.

ఈ విషయంలో సచిన్‌ కలుగజేసుకుని పరిష్కారించాలంటూ డిసౌజా ట్వీట్‌ చేశాడు. ఇది కొన్ని గంట ల వ్యవధిలోనే ఐదు లక్షల వ్యూస్‌కు తోడు 500 రీట్వీట్‌లు వచ్చాయి. క్రికెట్‌ ఐకాన్‌ పట్ల డిసౌజా వ్యవహరించిన తీరును సోషల్‌మీడియాలో చాలా మంది విమర్శిస్తూ ట్వీట్లు చేశారు. ఈ విషయంలో మీరు పోలీసులను సంప్రదించాల్సిందని ఒకరు అంటే…బీఎమ్‌సీ నిబంధనల ప్రకారమే నిర్మాణం జరుగుతుందని మరొకరు రాసుకొచ్చారు.

Next Story

Most Viewed