భర్తని మంచానికి కట్టేసి.. బట్టలు విప్పేసిన భార్య.. వీడియోలు చూసి పోలీసులు షాక్.. అరెస్ట్

by Disha Web Desk 14 |
భర్తని మంచానికి కట్టేసి.. బట్టలు విప్పేసిన భార్య.. వీడియోలు చూసి పోలీసులు షాక్.. అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లో మెహర్ జహాన్ అనే మహిళ తన భర్తను చీరలు, చున్నీతో మంచానికి కట్టేసి ఘోరంగా టార్చర్ చేసింది. దీంతో ఆమెను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. భర్తను టార్చర్ పెడుతున్న వీడియోలు చూసి.. పోలీసులతో పాటు నెటిజన్లు కూడా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూర్ ప్రాంతానికి చెందిన మెహెర్ జైన్ అనే మహిళను మన్నన్ జైదీ గత ఏడాది వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లైన కొన్ని రోజులకే బలవంతం మీద భర్తతో వేరు కాపురం పెట్టించింది. మందు, సిగరెట్ తాగితే అత్తమామలు అడ్డుపడతారని భర్తకు ఇష్టం లేకపోయినా వేరు కాపురం పెట్టించింది. తప్పు చేస్తున్నావని అంటే భర్తపై రివర్స్ అయ్యింది. అప్పటి నుంచి భర్తను శారీరకంగా, మానసికంగా హింసించడం మొదలుపెట్టింది. టార్చర్ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించేదట.

ఇక ఆమె పెట్టే టార్చర్ భరించలేక ఆమె భర్త గత నెలలో పోలీసులను ఆశ్రయించాడు. అయితే, పోలీసులు లైట్ తీసుకోవడంతో భార్య పెట్టే టార్చర్‌కి సంబంధించిన సాక్ష్యాలను పోలీసులకు చూపించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇంట్లో భార్యకు తెలియకుండా సీక్రెట్ కెమెరాలను ఏర్పాటు చేశాడు. తర్వాత రికార్డ్ అయిన దృశ్యాలను పట్టుకుని పోలీసుల దగ్గరకు వెళ్లగా.. ఒక్కసారిగా వీడియోలు చూసి పోలీసులు షాక్‌కు గురయ్యారు.

అయితే, వీడియోలో పాలలో మత్తు పదార్థం కలిపి ఇవ్వగా.. భర్త మత్తులోకి జారుకున్నాక చీరలు, చున్నీతో కాళ్లు, చేతులు కట్టేసి.. బట్టలు విప్పేసింది. ఆ తర్వాత అతని మీద కూర్చుని సిగరెట్ తాగి.. ఆ సిగరెట్ ని అతని ఒంటికి.. మర్మాంగం మీద చురకలు పెట్టింది. అంతేకాకుండా కత్తితో భర్త మర్మాంగాన్ని కత్తిరించాలని ప్రయత్నించింది. ఆ బాధను తట్టుకోలేక స్పృహలోకి వచ్చిన భర్త.. తనను వదిలేయమని ప్రాధేయపడినా గానీ భార్య వినలేదు.. మరింత చిత్రహింసలకు గురిచేసింది. ఈ టార్చర్ వీడియో రికార్డ్‌ను మన్నన్.. మరుసటి రోజు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి పోలీసులకు చూపించాడు. తర్వాత భాదితుడిని పోలీసులు హాస్పిటల్‌లో చేర్పించారు. అనంతరం భార్య మెహర్ మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Next Story

Most Viewed