చీరాల కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచికి షాక్

by srinivas |   ( Updated:26 April 2024 2:13 PM  )
CBI Issues Notice To YCP Leader Amanchi Krishna Mohan
X

దిశ, వెబ్ డెస్క్: చీరాల అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ పోటీ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరుగుతోంది. అయితే ఆయనకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి షాక్ ఇచ్చారు. ఆమంచి నామినేషన్‌ను పెండింగ్‌లో పెట్టారు. ఆమంచి కృష్ణమోహన్ విద్యుత్ బకాయి 4.63 కోట్లు చెల్లించలేదని నాగార్జునరెడ్డి అనే వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు ఆర్వోకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్‌ను పెండింగ్‌లో పెట్టారు. నామినేషన్ పత్రాల్లో కొన్ని ముఖ్యమైన దస్త్రాలు జతచేయకపోవడంతోనే ఆమంచి నామినేషన్‌ను పెండింగ్‌లో పెట్టినట్లు ఆర్వో తెలిపారు. సరైన వివరాలు అందజేస్తే ఆమంచి నామినేషన్‌ను ఆమోదిస్తామని పేర్కొన్నారు. దీంతో ఆమంచి కృష్ణమోహన్ వర్గీయుల్లో టెన్షన్ నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed