Modi podcast: మెలోడీతో మీమ్స్.. స్పందించిన ప్రధాని మోడీ ఏమన్నారంటే?

by Bhoopathi Nagaiah |
Modi podcast: మెలోడీతో మీమ్స్.. స్పందించిన ప్రధాని మోడీ ఏమన్నారంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాని నరేంద్రమోదీ(PM modi) తొలిసారి ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్నారు. జిరోదా కో ఫౌండర్ నిఖిల్ కామత్(Nikhil Kamat) నిర్వహించిన పీపుల్ పాడ్ కాస్ట్ లో ప్రధాని పాల్గొన్నారు. తన బాల్యం నుంచి ఇప్పటి వరకు జరిగిన సంఘటలన్నింటికి గురించి ప్రస్తావించారు. రాజకీయంగా ఆయన ఎదిగిన తీరు.. తన జీవితంలో ముఖ్యమైన ఘట్టాలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన పాడ్ కాస్ట్(podcast) ఫుల్ ఇంటర్వ్యూ విడుదలయ్యింది. ఇందులో నిఖిల్ కామత్ అనేక ప్రశ్నలను అడిగారు. వాటిని మోదీ సమాధానం చెప్పారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో మన ప్రదాని మోదీ((PM modi))..ఇటలీ ప్రధాని జార్జియా మెలోని (Italian Prime Ministe)స్నేహంపై మెలోడీ పేరుతో వైరల్ అవుతున్న మీమ్స్ గురించి నిఖిల్ కామత్ ప్రస్తావించారు. దానికి ప్రధాని మోదీ ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పారు.

నిఖిల్ కామత్ తెలివితో అడిగిన ప్రశ్నలకు మోదీ(modi) అంతకుమించిన తెలివితో సమాధానం చెప్పారు. తనకు ఇష్టమైన ఆహారం పిజ్జా (pizza)అని మోదీ చెబుతుంటే..పిజ్జా అనేది ఇటలీ నుంచి వచ్చిందని నిఖిల్ కామత్ అన్నారు. మీకు ఇటలి గురించి చాలా తెలుసని ప్రజలు అనుకుంటున్నారని మోదీని అడిగారు. ఇటలీ గురించి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా అని నవ్వుతూ అడిగారు. మీరు ఈ మెలోడీ మీమ్స్ చూడలేదా అని మోదీని అడిగితే..ఆయన దానికి సమాధానం ఇచ్చారు. అలాంటి మీమ్స్(memes) తాను చూడలేదని..అలాంటివి జరుగుతూనే ఉంటాయని అందులో పడి తాను తన విలువైన సమయాన్ని వృథా చేసుకోలేనంటూ సమాధానం చెప్పారు. ఆ తర్వాత చర్చను ప్రధాని మోదీ ఆహారం గురించి మళ్లించారు.

నేను భోజన ప్రియుడిని కాదు.. అందుకే నాకు ఏమి వడ్డించినా.. ఏ దేశంలో అయినా నేను వాటిని ఆస్వాదిస్తుంటాను అని మోదీ వివరించారు. నన్ను రెస్టారెంట్ కు తీసుకెళ్లి మెనూ ఇచ్చి సెలక్ట్ చేసుకోమని అడిగే నేను ఏం సెలక్ట్ చేసుకోవాలో నాకు అర్థం కాదంటూ ప్రధాని మోదీ చెప్పారు. మీరు ఎప్పుడైనా రెస్టారెంట్ కు వెళ్లారా అంటూ అడిగిన ప్రశ్నకు లేదు నేను ఇప్పుడు వెళ్లడం లేదు. నేను రెస్టారెంట్ వెళ్లి చాలా ఏళ్లు అయ్యిందని ప్రధాని సమాధానం ఇచ్చారు.

Next Story