దారుణం.. 9 నెలల నుంచి ఫ్రిజ్‌లో ప్రియురాలి మృతదేహం

by srinivas |
దారుణం.. 9 నెలల నుంచి ఫ్రిజ్‌లో  ప్రియురాలి మృతదేహం
X

దిశ, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్‌(Madyapradesh)లో దారుణం జరిగింది. బృందావన్ ధామ్‌(Brindavan Dham)లో సంజయ్ పాటిదార్ అనే వ్యక్తి గత ఐదేళ్లుగా ప్రియురాలు ప్రతిభా అలియాస్ పింకీతో సహజీవనం చేశారు. అయితే వివాహం కోసం పింకీ ఒత్తిడి చేశారు. దీంతో తన స్నేహితుడు వినోద్ దేవ్‌తో కలిసి ఆమెను సంజయ్ హత్య చేశారు. అనంతరం కాళ్లు, చేకులు కట్టేసి మృతదేహాన్ని ఫ్రిడ్జ్‌లో దాచి పెట్టారు. గత ఏడాది జూన్‌లో ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇంట్లోంచి దుర్వాసన రావడంతో పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు... ఫ్రిడ్జ్‌లో నుంచి పింకీ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు. నిందితుడు సంజయ్‌ను అరెస్ట్ చేశారు.

Next Story