- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Thaman: సినిమాకి ముందు హైప్ ఇవ్వడం ఆపవయ్యా తమన్ అంటూ ఫైర్ అవుతున్న నెటిజన్స్

దిశ, వెబ్ డెస్క్ : వరుస సినిమాలతో దూసుకెళ్తున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ( Thaman )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సారి సంక్రాంతి మొత్తం తమన్ దే అన్నట్టు ఉంది. ఎందుకంటే , రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన మూవీ " గేమ్ ఛేంజర్ " కి, బాలకృష్ణ " డాకు మహారాజ్ " కు సంగీతాన్ని అందించాడు. రామ్ చరణ్ సినిమా విడుదల కాగా, బాలయ్య బాబు మూవీ 12 న విడుదల కానుంది. అయితే, ఈ క్రమంలోనే తమన్ స్టేజ్ ల మీద ఆసక్తికర కామెంట్స్ చేస్తూ ఫ్యాన్స్ కి బూస్ట్ ఇస్తున్నాడు. ఇక, ఇప్పుడు అదే మాటలను పట్టుకుని ట్రోలర్స్ , అభిమానులు తమన్ పై ఫైర్ అవుతున్నారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మాటలు బాగానే చెబుతున్నాడు, సినిమా రిలీజ్ అయ్యాక తేడా కొడుతోంది. రామ్ చరణ్ సినిమాలో బీజీఎమ్ పర్లేదు.. కానీ, నువ్వు మమ్మల్ని హర్ట్ చేసావ్ అంటూ మెగా ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు. ఇప్పుడు, బాలయ్య సినిమాకి కూడా అలాగే చెబుతున్నావ్ .. సౌండ్ బాక్సులు బద్దలవుతాయంటూ .. సినిమా రిలీజ్ అయ్యాక ఏమైనా తేడా జరగాలి నిన్ను ట్రోల్ చేయడం పక్కా.. అయిన నువ్వు సినిమాకి ముందు హైప్ ఇవ్వడం ఆపవయ్యా ఇక తమన్ పై ( Thaman ) నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.