ముసుగు తొలగించిన అనుపమ.. ఒరిజినల్ బయటపడిందిగా..?

by sudharani |   ( Updated:2024-04-26 14:14:48.0  )
ముసుగు తొలగించిన అనుపమ.. ఒరిజినల్ బయటపడిందిగా..?
X

దిశ, సినిమా: కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ‘ప్రేమమ్’ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక ‘అ..ఆ..’ చిత్రంతో తెలుగు తెరకు పరచయమైన బ్యూటీ అనతి కాలంలోనే మంచి గుర్తింపును తెచ్చుకుంది. ‘శతమానంభవతి’ చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుని.. కుర్రాళ్లకు మరదలుగా మారిపోయింది. ఇక తాజాగా వచ్చిన ‘టిల్లు స్వ్కేర్’ చిత్రంతో బోల్డ్‌గా దర్శనమిచ్చి ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసింది. అయితే.. ఇంకా టిల్లు ముచ్చట కంప్లీట్ కాకముందే.. ఈ ముద్దుగుమ్మ మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది.

అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా సినిమా ‘పరదా’. ప్రవీణ్ కండ్రేగు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ఆనంద మీడియా బ్యానర్‌పై విజయ్ డొంకాడ నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్కడా చూడని కథతో వస్తున్న ఈ చిత్రం టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో మొదట అనుపమ మొఖానికి పరదా కప్పుకుని కనిపిస్తుంది. తర్వాత దానిని స్లోగా తొలగిస్తూ టైటిల్ రివీల్ చేశారు. ఇందులో అనుపమ నేచురల్ లుక్‌లో ఆకట్టుకోవడంతో.. ప్రస్తుతం ఈ టీజర్‌కు నెట్టింట విశేష స్పందన లభిస్తుంది.

Click here for Paradha Concept Video

Advertisement

Next Story