- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెన్షన్‌లో ప్రధాని మోడీ.. త్వరలో ఏడ్చేస్తారేమో : రాహుల్ గాంధీ
దిశ, నేషనల్ బ్యూరో : ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎన్నికల ప్రసంగాలు చేస్తున్న టైంలో చాలా ఉద్రేకంగా, ఒత్తిడిలో కనిపిస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు. త్వరలోనే ఎన్నికల ప్రచార వేదికపై ఆయన కన్నీళ్లు పెట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో ఎదురుకాబోతున్న ఓటమి భయం ప్రధాని మోడీ మొహంలో స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. కర్ణాటకలోని బీజాపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ఈ కామెంట్స్ చేశారు.
#WATCH | | Bijapur, Karnataka: Congress leader Rahul Gandhi addresses a public rally and says, "You are seeing the speeches of PM Modi, he is tense. Maybe in a few days, he will shed tears on the stage. He just tries to distract your attention 24 hours..." pic.twitter.com/16t6iTUbKy
— ANI (@ANI) April 26, 2024
‘‘ప్రధాని మోడీ గత పదేళ్లలో దేశంలోని పేదల డబ్బును దోచుకున్నారు. దేశంలోని 70 కోట్ల మంది ప్రజలకు ఉన్నంత సంపదను 22 మందికి ప్రధాని ఇచ్చారు. మన దేశంలోని 1 శాతం మంది దగ్గర 40 శాతం సంపద ఉంది. మేం గెలిచాక నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సమస్యలను పారదోలుతాం. బిలియనీర్లకు మోడీ ఎంతైతే ఇచ్చారో.. అంతే మొత్తాన్ని మేం దేశంలోని సామాన్య ప్రజలకు ఇస్తాం. వాళ్లను లక్షాధికారులను చేస్తాం’’ అని కాంగ్రెస్ అగ్రనేత హామీ ఇచ్చారు.