సౌత్​ జోన్​ డీసీపీ గా బాధ్యతలు స్వీకరించిన ఐపీఎస్​ అధికారిణి స్నేహ మెహ్రా

by Disha Web Desk 11 |
సౌత్​ జోన్​ డీసీపీ గా బాధ్యతలు స్వీకరించిన ఐపీఎస్​ అధికారిణి స్నేహ మెహ్రా
X

దిశ, చార్మినార్​ : దక్షిణ మండలం డీసీపీ గా ఉత్తరాఖండ్​ వాస్తవ్యురాలు 2018 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్​ అధికారిణి స్నేహ మెహ్రా శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఇప్పటి వరకు సౌత్​ జోన్​ డీసీపీలుగా నియమితులైన వారిలో తొలి మహిళా ఐపీఎస్​ అధికారిణిగా స్నేహ మెహ్రా రికార్డుల్లోకి ఎక్కింది. ఇప్పటి వరకు ఇక్కడ డీసీపీ గా విధులు నిర్వహించిన సాయి చైతన్య డీజీపీ ప్రధాన కార్యాలయానికి బదిలీ అయ్యారు.

సౌత్​జోన్​ డీసీపీ సాయి చైతన్య మజ్లిస్​ పార్టీకీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని హైదరాబాద్​ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో పరిశీలించిన ఎన్నికల సంఘం సాయిచైతన్యను డీజీపీ కార్యాలయానికి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ముక్కుసూటి స్వభావి అయిన ఉత్తరఖాండ్ కు చెందిన స్నేహ నెహ్రా 2018లో ఐపీఎస్​గా సెలెక్ట్​ అయ్యారు. అనంతరం నేషనల్​ పోలీస్​ అకాడమీలో ఐపిఎస్​ అధికారిణి స్నేహ నెహ్రా సైబర్​ నేరాల విభాగంలో ప్రత్యేక శిక్షణ పొందారు.

పాతబస్తీ మక్కా మసీదు ను సందర్శించిన సౌత్​జోన్​ డీసీపీ స్నేహ నెహ్రా..

దక్షిణమండలం డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే స్నేహ మెహ్రా అడిషనల్​ డీసీపీ షేక్​ జహంగీర్​తో కలిసి శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు సందర్భంగా పాతబస్తీలోని చారిత్రాత్మక చార్మినార్​, మక్కా మసీద్​ ప్రాంతాలను సందర్శించి, అక్కడి పోలీస్​ బందోబస్తును పరిశీలించారు.



Next Story

Most Viewed