AP Politics:ఆ నియోజకవర్గంలో మార్పు మొదలైంది..ఆ పార్టీ వైపే మొగ్గు చూపుతున్న ప్రజలు!

by Disha Web Desk 18 |
AP Politics:ఆ నియోజకవర్గంలో మార్పు మొదలైంది..ఆ పార్టీ వైపే మొగ్గు చూపుతున్న ప్రజలు!
X

దిశ,మాచర్ల:కూటమి ఎన్నికల మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజల్లోనూ మార్పునకు నాంది పలుకుతోంది. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కూటమి మేనిపెస్టోను ప్రజలు బేరీజు వేసుకుంటుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఐదేళ్ల వైసీపీ పాలనలో నవరత్నాల పేరుతో అరకొర లబ్ధి చేకూర్చడం మినహా... అభివృద్ధిని పూర్తిస్థాయిలో విస్మరించారనే అన్ని వర్గాల ప్రజలు జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో అమలు పరిచిన పథకాలనే మళ్లీ మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతాంగం, కార్మికులు, మహిళల్లోనూ వైసీపీ పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

గత ఎన్నికల సమయంలో అమ్మ ఒడి పథకాన్ని ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్న అమలు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఈ ఒక్కరికే అమలు చేశారు. అమ్మఒడి ద్వారా ఒక్కొక్కరికి రూ.15 వేలు ఇస్తామని చెప్పి, చివరకు రూ.13 వేలతో సరిపెట్టారు. వైఎస్సార్ చేయూత, వైయస్సార్ ఆసరా పథకాలతో మహిళల ఆర్థిక సాధికారితకు పెద్దపీట వేస్తామని చెప్పారు. బటన్ నొక్కారేగాని సకాలంలో వారి ఖాతాలో సొమ్ము జమ చేయలేదు. మహిళలకు సంబంధించిన పథకాలు సక్రమంగా అమలు చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. ఈ పరిణామాలన్నీ వైసీపీని మరింత ఇరుకున పెడుతున్నాయి.

కూటమి మేనిఫెస్టో లో మహిళల ఆర్థిక స్వావలంబనకు, సాధికారితకు పెద్దపీట వేశారు. దీంతో ఆ వర్గాలు కూటమికి జై కొడుతున్నాయి. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఆ పథకాన్ని వర్తింపజేస్తామని ప్రకటించారు. ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామన్నారు. 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు నెలకు రూ.1500, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచడం, ప్రత్యేక పథకం ద్వారా 24 మోడల్ లో మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అంగన్వాడీ కార్యకర్తలకు సుప్రీం కోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తామనడం, ఆశావర్కర్లకు కనీస వేతనం పెంచేందుకు చర్యలు తీసుకుంటామని, ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వసతి కల్పిస్తామనడం, కలలకు రెక్కలు పథకం ద్వారా విద్యార్థులకు రుణాలు అందిస్తామనడం, పండుగలు, పెళ్లిళ్లకు కానుకలు పునరుద్ధరిస్తామని చెప్పడం, దీపం పథకం ద్వారా ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తామనడం మహిళల్లో సంతోషాన్ని నింపుతోంది. వైసీపీ పాలనలో జరిగిన లబ్దితో పోల్చుకుంటే కూటమి మహిళల కోసం అమలు చేయబోయే పథకాలు ద్వారా ఎక్కువ లబ్ధి చేకూరుతుందని అంటున్నారు.

కుటుంబానికి ఆర్థిక చేయూతతో పాటు, జీవన ప్రమాణాల పెంపునకు టీడీపీ మేనిఫెస్టో బాటలు వేస్తుందన్న నమ్మడం మహిళల్లో కనిపిస్తుంది. వైసీపీ అభ్యర్థులకు కూటమి మేనిఫెస్టో ఫోబియా పట్టుకుంది. అన్ని వర్గాల ప్రజలు ఆకర్షించే విధంగా, అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక చేయూతనిచ్చేలా కూటమి మేనిఫెస్టో ఉంది. ఇది వైసీపీ అభ్యర్థులను కలవరపాటుకు గురి చేస్తోంది. టీడీపీ మేనిఫెస్టో ప్రజల జీవన ప్రమాణాలను పెంచేలా, అభివృద్ధికి బాటలు వేసేలా ఉంది. ఈ పరిణామాలను చూసి వైసీపీ అభ్యర్థులకు ఓటమి భయం పట్టుకుంది.

Next Story

Most Viewed