- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చివరి నిమిషంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి సభ రద్దు.. ఏం జరిగిందంటే?
దిశ, వెబ్‌డెస్క్: ఎండలు మండిపోతున్న వేళ తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల అకాల వర్షం దంచికొట్టింది. ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. అయితే, ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. అయితే ఇంతలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పడటంతో అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లు, కుర్చీలు చెల్లాచెదురు అయ్యాయి. ఈ సమయంలో టెంట్ల కింద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, కాలేజీ సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్టేజీ కూలిపోయి అల్లకల్లోలం కావడంతో సభ రద్దు అయింది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలకు పలు కొనుగోలు కేంద్రాల్లోని రైతుల ధన్యం తడిసిపోయింది. చెట్లు విరిగి పడటంతో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Read More...