BREAKING: లోక్‌సభ ఎన్నికల వేళ సంచలనం.. వీడియో రిలీజ్ చేసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ

by Shiva |   ( Updated:2024-05-08 12:59:05.0  )
BREAKING: లోక్‌సభ ఎన్నికల వేళ సంచలనం.. వీడియో రిలీజ్ చేసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ట్విట్టర్ వేదికగా ఓ సంచలన వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఆమె బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. దేశంలో అభివృద్ధి వైపు పరుగులు పెట్టాలంటే మళ్లీ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాలని పిలుపునిచ్చారు. బీజేపీ పాలనలో దేశంలో పాలన అస్తవ్యస్తంగా తయారైందని విమర్శించారు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మైనార్టీల బతుకులు నేటికీ మారలేదని ధ్వజమెత్తారు. నిరుద్యోగ సమస్యతో దేశ వ్యాప్తంగా యువత పెడదోవ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ మోడీ రాజకీయ లబ్ధి, అనాలోచిత నిర్ణయాల వల్లే దేశంలో అన్ని వ్యవస్థల పతనానికి కారణం అవుతున్నాయని ఫైర్ అయ్యారు. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ నిరంతరం శ్రమిస్తూనే ఉంటుందని.. రాబోయే ఎన్నికల్లో బీజేపీతో కొట్లాడేందుకు ప్రజలకు తమ బలాన్ని ఇవ్వాలని ప్రజలనే ఆమె అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి రాజ్యాంగ పరిరక్షణకు పనిచేస్తోందని తెలిపారు. నవ భారత నిర్మాణం కోసం కాంగ్రెస్‌కు ఓటు వేయాలని.. ఐక్య భారతదేశాన్ని నిర్మిద్దామంటూ సోనియా గాంధీ ఓటర్లకు పిలుపునిచ్చారు.

Advertisement

Next Story