- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రెండో దశ పోలింగ్ ముగిసిన తరుణంలో ప్రధాని మోడీ కీలక ప్రకటన
దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి రెండో దశ పోలింగ్ ముగిసిన నేపథ్యంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక ప్రకటన విడుదల చేశారు. రెండోదశ పోలింగ్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు 'చాలా సానుకూలంగా ఉందని' శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజల నుంచి అధికార కూటమికి అసమానమైన మద్దతు లభించిందని అభిప్రాయపడ్డారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఎక్స్‌లో ట్వీట్ చేసిన ఆయన.. 'ఫేజ్2 చాలా బాగుంది. ఓటు వేసిన దేశంలోని ప్రజలందరికీ కృతజ్ఞతలు. ఎన్డీఏకు వచ్చిన అద్భుతమైన మద్దతుతో ప్రతిపక్షాలు మరింత నిరాశకు గురవతాయి. ఓటర్లు ఎన్డీఏ సుపరిపాలనను కోరుకుంటున్నారు. యువత, మహిళా ఓటర్లు ఎన్డీఏకు పెద్ద ఎత్తున బలపరిచారని' పేర్కొన్నారు. కాగా, ఏప్రిల్ 19న మొదటి దశ ఓటింగ్ తర్వాత కూడా ప్రధాని మోడీ ఇదే తరహా ప్రకటన చేశారు. అధికార ఎన్డీఏ కూటమికి ఓటర్ల నుంచి గొప్ప స్పందన కనిపించిందని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రజలు రికార్డు స్థాయిలో ఎన్డీఏకు ఓటు వేస్తున్నారని వెల్లడించారు.