- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోహ్లీని కౌగిలించుకోవడానికి కారణం అదే : విలియమ్సన్
దిశ, స్పోర్ట్స్ : డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రాస్ టేలర్ విన్నింగ్ రన్స్ కొట్టగానే న్యూజీలాండ్ జట్టు మొత్తం సంబురాల్లో మునిగిపోయింది. అయితే, ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ మాత్రం విరాట్ కోహ్లీ వద్దకు వెళ్లి కౌగిలించుకున్నాడు. ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అయ్యింది. అయితే అసలు కేన్ ఎందుకు విరాట్‌ను కౌగిలించుకున్నాడనేది అర్దం కాలేదు. మామూలుగా అయితే ఇరు జట్లు కెప్టెన్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు.
దీనిపై కేన్ విలియమ్‌సన్ స్పందిస్తూ ‘విరాట్, నేను చాలా కాలంగా మంచి సహచరులం. మా ఇద్దరి ఆసక్తులు, ఇష్టాఇష్టాలు ఒకేలా ఉంటాయి. వేర్వేరు జట్లకు కెప్టెన్స్ అయినా మా మధ్య వైరం లాంటిది ఏమీ ఉండదు. నాకు క్రికెట్ వల్ల దొరికిన స్నేహితుల్లో కోహ్లీ ముఖ్యమైన వాడు. అందుకే ఆ రోజు కౌగిలించుకున్నాను. ఒక మ్యాచ్‌లో ఓడిపోయినంత మాత్రాన విరాట్ కోహ్లీని, టీమ్ ఇండియాను తక్కువగా అంచనా వేయలేము’ అని కేన్ వ్యాఖ్యానించారు.