- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నన్ను కోహ్లితో కాదు పాకిస్తాన్ దిగ్గజాలతో పోల్చండి: బాబర్
by Shyam |
X
దిశ, స్పోర్ట్స్: తన ప్రతిభను పొగడాలనుకున్నా, పోల్చాలనుకున్నా టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో కాకుండా పాక్ లెజెండరీ క్రికెటర్లతో పోల్చాలని ఆ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్ బాబర్ ఆజమ్ అన్నాడు. తనను వేరే దేశపు క్రికెటర్లతో పోల్చడం వల్ల తాను సాధించిన ఘనతలకు గుర్తింపు లేకుండా పోతుందని ఆజమ్ చెప్పాడు. ప్రపంచ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తూ, జట్టు విజయాల్లో పాలు పంచుకుంటున్న బాబర్ ఆజమ్‌ను అందరూ విరాట్ కోహ్లితో పోలుస్తున్నారు. తాను కూడా విరాట్ స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నట్లు ఆజమ్ చెప్తుంటాడు. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ తనను కోహ్లితో పోల్చవద్దని ఆయన వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ‘తనను పోల్చాలనుకుంటే కోహ్లితో కాకుండా పాకిస్తాన్ లెజండరీ క్రికెటర్లు జావెద్ మియాందాద్, యూనిస్ ఖాన్, ఇంజమామ్ ఉల్ హక్‌తో పోల్చాలి’ అని కోరుకున్నాడు.
Advertisement
Next Story