- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండియన్లు త్వరగా టీకా వేసుకోవాలి:డ బ్ల్యూహెచ్‌వో
న్యూఢిల్లీ: కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు తెలుస్తున్నదని, కాబట్టి భారతీయులు అవకాశం రాగానే వెంటనే టీకా వేసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) సూచించింది. లేదంటే ముప్పు తప్పదన్నట్టుగా సూచనప్రాయంగా హెచ్చరించింది కూడా. గతేడాది మహమ్మారితో సామర్థ్యం మేరకు వినియోగించుకున్న హెల్త్ సర్వీసులకు సెకండ్ వేవ్ పెనుసవాల్‌ను విసిరిందని పేర్కొంది.
ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు వెనక్కి తగ్గినట్టు తెలుస్తున్నదని, కొన్ని ప్రాంతాల్లో తగ్గుముఖం పట్టిందనీ డబ్ల్యూహెచ్‌వో సౌత్ ఈస్ట్ ఏషియా రీజనల్ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ క్షేత్రపాల్ సింగ్ తెలిపారు. అయినప్పటికీ పరిస్థితులు ఇంకా సాధారణ స్థితికి చేరుకోలేదని పేర్కొన్నారు. మరో వేవ్‌పై అంచనా వేయలేమని వివరించారు. కాబట్టి, ఇన్నాళ్ల కష్టాన్ని, జాగ్రత్తలను వృథా పోనివ్వద్దని, తప్పకుండా కొవిడ్-19 టీకాలను తీసుకోవాలని హెచ్చరించారు.