స్వచ్ఛందంగా మందుకు రావాలి

by Sridhar Babu |   ( Updated:2020-04-07 04:52:18.0  )
స్వచ్ఛందంగా మందుకు రావాలి
X

దిశ, కరీంనగర్: మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారిని కలుసుకున్న వారు స్వచ్ఛందంగా ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ శశాంక, సీపీ కమలాసన్ రెడ్డిలు కోరారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌కు చెందిన వారికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆ ప్రాంతాన్ని నిర్బంధించారు. ఈ సందర్భంగా ఆయా కాలనీల్లో పర్యటించిన కలెక్టర్, సీపీలు అక్కడి పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో పాజిటివ్ వచ్చిన వ్యక్తులను నేరుగా కలిసిన వారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కలిసి పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయా కాలనీల్లో చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు. నిర్ధేశిత ప్రాంతాల్లో నిఘా కట్టుదిట్టం చేయాలని కోరారు.

Tags: corona virus, Karimnagar, collector,cp

Advertisement

Next Story