- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎవరీ వికాస్ దూబె?
లక్నో: వికాస్ దూబెను అరెస్టు చేయడానికి వచ్చిన డీఎస్పీ సహా ఎనిమిది మంది పోలీసులు కాన్పూర్‌లో శుక్రవారం తెల్లవారుజామున కాల్పుల్లో మరణించారు. పోలీసుల రాకను ముందే పసిగట్టిన వికాస్ దూబె వర్గం కాల్పులకు తెగబడటంతో వారు స్పాట్‌లోనే ప్రాణాలు విడిచారు. ఇంతకు 60 కేసులున్న ఈ వికాస్ దూబె ఎవరు? గతంలో ఆయన ఓ పార్టీ మెంబర్‌గా కొనసాగిన దూబెకు రాజకీయ పరిచయాలు ఘనంగానే ఉన్నాయి. 1990లో మర్డర్ కేసుతో వికాస్ దూబె నేరప్రస్థానం మొదలైంది. మర్డర్, కిడ్నాప్, డబ్బు వసూళ్లు, అల్లర్లులాంటి కనీసం 60 కేసులు అతనిపై ఉన్నాయి. అయితే, ఈ కేసులన్నింటిలో దోషిగా తేలడం, తర్వాత పరారవ్వడం అతనికి పరిపాటిగా మారింది. 2001లో కాన్పూర్‌లో బీజేపీ నేత సంతోష్ శుక్లా హత్యా అభియోగాలు మోపారు. ఈ కేసులో పోలీసులకు సరెండర్ అయినా, నిర్దోషిగా 2002లో బయటపడ్డాడు. తాజాగా, ఓ మర్డర్ అటెంప్ట్ కేసులో అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించగా, మళ్లీ చిక్కకుండా పారిపోయాడు.