నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ ఎవరు..?

by Shyam |
నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ ఎవరు..?
X

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ నియామకం లాంఛనం కావడంతో.. ప్రస్తుతం అతడు నిర్వర్తిస్తున్న నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్ఏసీ) డైరెక్టర్ పదవి ఖాళీ కానున్నది. బీసీసీఐ ఆధ్వర్యంలో బెంగళూరులో నిర్వహిస్తున్న ఎన్ఏసీ కోసం అనుభవజ్ఞులైన మాజీ క్రికెటర్లను నియమించాలని బోర్డు భావిస్తున్నది. మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌కు ఈ పదవిని ఆఫర్ చేసినట్లు తెలుస్తున్నది. వాస్తవానికి లక్ష్మణ్ టీమ్ ఇండియా కోచ్ పదవిని ఆశించాడు. కానీ బోర్డు రాహుల్ ద్రావిడ్ వైపే మొగ్గు చూపింది. దీంతో లక్ష్మణ్‌ను ఎన్ఏసీ డైరెక్టర్‌గా నియమించాలని భావిస్తున్నది. ఒక వేళ ఎన్ఏసీ డైరెక్టర్ పదవిని లక్ష్మణ్ కనుక తిరస్కరిస్తే అనిల్ కుంబ్లేను ఆ స్థానంలో నియమించేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తున్నది. టీ20 వరల్డ్ కప్ ముగిసే లోగా రాహుల్ ద్రావిడ్ ఎన్ఏసీ డైరెక్టర్ పదవి నుంచి తప్పుకొని టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాల్సి ఉన్నది. ఆ లోగా కొత్త డైరెక్టర్ పదవిని బీసీసీఐ భర్తీ చేసే అవకాశం ఉన్నది.

Advertisement

Next Story