- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోదీ ప్రశంసలందుకున్న జోనస్ ఎవరు?
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ తన ‘మన్ కీ బాత్’లో బ్రెజిల్‌కు చెందిన జోనస్ మాసెట్టి విశ్వనాథ్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. భారతదేశ సంప్రదాయాలు, పవిత్ర గ్రంథాలు ప్రపంచ దేశాల ప్రజలను ఎప్పుడూ ఆకట్టుకుంటాయని, అందుకు జోనస్ చేస్తున్న పనే నిదర్శనమని ఈ సందర్భంగా వెల్లడించారు. ఇంతకీ జోనస్ ఎవరు? ఆయన ఏం చేస్తున్నాడు?
బ్రెజిలియన్ జోనస్ మాసెట్టి.. గీతా సారాంశాన్ని, వేద పాఠాలను, ఆధ్యాత్మిక అంశాలను బ్రెజిల్‌లోని రియో డిజెనిరియో ప్రజలకు బోధిస్తున్నాడు. తాము ఎవరో, ఎందుకు పుట్టామో తెలుసుకోవాలనే అన్వేషణలో భాగంగా చాలామంది ఫారినర్స్ మన ఇండియాకు వస్తుంటారు. వీరిలో తమ జీవితకాలమంతా ఇక్కడే ఉండిపోయేవారు కొందరైతే, తమ దేశాలకు వెళ్లి భారతీయ గ్రంథ సారాంశాలను అక్కడి వాళ్లకు బోధిస్తూ తమ జీవితాన్ని సార్థకం చేసుకునేవాళ్లు ఇంకొందరు. ఇక జోనస్ విషయానికొస్తే.. స్వతహాగా మెకానికల్ ఇంజనీర్ అయిన తను స్టాక్ మార్కెట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. భారతీయ సంప్రదాయాలకు, వేదాలకు ఆకర్షితుడై, చేస్తున్న ఉద్యోగం వదిలేసి ఇండియాకు వచ్చాడు. కోయంబత్తూర్‌లోని అర్ష వైద్య గురుకులంలో 4 సంవత్సరాల పాటు వేదాలను అభ్యసించాడు. ఈ క్రమంలో ‘విశ్వ వైద్య’ అనే ఆర్గనైజేషన్‌ను నెలకొల్పిన జోనస్.. వాటి విలువను, సారాంశాన్ని ఇప్పుడు తన దేశ ప్రజలకు బోధిస్తూ ‘వేదాంత.లైఫ్’ అనే వెబ్‌సైట్ కూడా రన్ చేస్తున్నాడు. అంతేకాదు జోనస్ తన పేరు చివరన ‘విశ్వనాథ్’ను యాడ్ చేసుకోవడం విశేషం. ఈ విషయాలపై స్పందించిన ప్రధాని మోదీ.. జోనస్ కృషి నిజంగా అభినందనీయమని అన్నారు.
జోనస్ ఫైనాన్షియల్ మార్కెట్‌లో పనిచేస్తుండగా నిత్యం తనను కొన్ని ప్రశ్నలు వేధించేవి. ఫ్యామిలీ, గర్ల్ ఫ్రెండ్, మనీ, ప్రొఫెషనల్ సక్సెస్ అన్నీ ఉన్నా కూడా సంతృప్తి ఉండటం లేదని బాధపడేవాడు? తనకే కాదు, చాలామంది తమ వ్యక్తిగత జీవితాల్లో సక్సెస్ సాధించినప్పటికీ శాంతంగా ఉండటం లేదని, తమ జీవితం మీద క్లారిటీగా, సంతృప్తిగా ఉండలేకపోతున్నారని తనకు అర్థమైంది. అయితే తన ప్రశ్నలన్నింటికీ వేదాలు, సనాతన సంప్రదాయాలు సమాధానాలను చూపించాయి. శాంతితో పాటు జీవితం మీద బ్యాలెన్స్ ఉండాలంటే తప్పకుండా వేదాలు చదవాలంటున్న జోనస్.. తను నేర్చుకున్న జ్ఞానంతో తన దేశ ప్రజలకు కూడా జీవితమంటే ఏంటో వివరించే ప్రయత్నం చేస్తున్నాడు.
విశ్వ వైద్యలో వేదాంత, సంస్కృత పాఠాలతో పాటు మంత్రాలు, వేదిక్ కల్చర్ నేర్పిస్తారు. కాగా స్వామి దయానంద సరస్వతినే స్వయంగా విశ్వ వైద్య పేరును సూచించాడని జోనస్ తెలిపాడు. ఇక జోనస్ ఆహార్యం చూస్తే, మన తెలుగు పండితులు గుర్తురాకమానరు. సంప్రదాయ వస్త్రధారణ, నుదుటన కుంకుమతో చాలా శాంతంగా కనిపిస్తుంటాడు జోనస్.