వారెవ్వా.. శుభ్‌మన్! సచిన్, కింగ్ కోహ్లీ జాబితాలోకి గ్రాండ్ ఎంట్రీ

by Shiva |   ( Updated:2024-02-05 06:39:39.0  )
వారెవ్వా.. శుభ్‌మన్! సచిన్, కింగ్ కోహ్లీ జాబితాలోకి గ్రాండ్ ఎంట్రీ
X

దిశ, వెబ్‌డెస్క్: భారత యంగ్, టాలెంటెడ్ బ్యాట్స్‌మెన్ శుభ్‍మన్ గిల్ తిరిగి ఫామ్‍లోకి వచ్చేశాడు. కొంత కాలంగా టెస్టు క్రికెట్‍లో వరుసగా విఫలమవుతున్న అతను 11 నెలల తరువాత విశాఖ టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో కదంతొక్కాడు. ఈ సెంచ‌రీనితో 24 ఏళ్ల వయసులో ఇంటర్‌నేషనల్ క్రికెట్‌లో 10 సెంచరీలు చేసిన ఆటగాడిగా గిల్ చ‌రిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో అతను లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్, కింగ్ విరాట్ కోహ్లీ జాబితాలో చేరాడు. 24 ఏళ్ల వయసులో 30 సెంచరీలు చేసి రికార్డు సృష్టించి సచిన్ మొదటి స్థానంలో ఉండగా.. క్లాస్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (21) ద్వితీయ స్థానం, యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ (10) సెంచరీలు చేసి మూడో స్థానంలో నిలిచాడు.

సచిన్ టెండూల్కర్ 273 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధిస్తే, విరాట్ కోహ్లీ 163, శుభ్‌మన్ గిల్ 99 ఇన్నింగ్స్‌ల్లో 10 సెంచరీలు సాధించారు. రవిశాస్త్రి, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్‌లు 9 సెంచరీలతో ఆ తరువాత స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఈవెంట్‌లో శుభ్‌మన్ గిల్ ఇప్పటి వరకు రెండు సెంచ‌రీలు సాధించాడు. దీంతో టీమిండియా తరఫున అత్యధిక సెంచరీలు సాధించిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 5 సెంచరీలతో రోహిత్‌శర్మ ప్రథమ స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ 3 సెంచ‌రీల‌తో రెండో స్థానంలో ఉన్నాడు.

Advertisement

Next Story