హజారాలపై తాలిబన్లు తిరిగి దాడులు చేస్తారా?

by Shamantha N |
abdul mazari
X

దిశ వెబ్‌డెస్క్: అప్ఘాన్ అనేక జాతుల సమూహం. వారిలో ప్రధానంగా ఫష్తూన్ తెగతో పాటు, తజిక్, ఉజ్బెక్‌, హజారా లాంటి ఇతర తెగలున్నాయి. వీరిలో ఉత్తర ప్రాంతాలలో కొన్ని తెగలు, మధ్య ప్రాంతంలో కొన్న తెగలు నివాసం ఉన్నాయి. అయితే తజిక్, ఉజ్బెక్ తెగల కంటే తాలిబన్లు ఎక్కువగా హజారా ముస్లింపై దాడులకు పాల్పడుతుంటున్నారు. దీనికి కారణం వీరు షియా వర్గానికి చెందిన వారు కావటం. తాలిబన్లు సున్నీ వర్గానికి చెందిన వారు కావటంతో వీరు తరుచుగా హజారా తెగలపై విరుచుపడుతుంటారు. మొదటి నుంచి తాలిబన్లు హజరాలను తమ తోటి ముస్లింలుగా చూడలేదు. దాంతో పాటు వీరిది మంగోలియా ప్రాంతం అని మా దేశానికి అక్రమంగా వలస వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు.

ఇంతకీ హజారాలంటే ఎవరూ?
క్రీ.శ. 13 శతాబ్దంలో మధ్య ఆసియా ప్రాంతాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నించిన మంగోల్ దండయాత్రికుడు చెంఘిజ్‌ఖాన్‌కు చెందిన సంతతి వారే హజారాలు. యుద్దాల కోసం తరుచు రావటంతో ఇది వారి మాతృభూమి అయింది. అయితే వీరి ఉనికిని తాలిబన్లు సహించలేదు. తమకు అగర్భ శత్రువులంటూ తరుచూ దాడికి చేయటంతో పాటు, హజారాలను నాన్ ముస్లింగా ప్రకటించింది. చనిపోతే చేసే ఖనన పద్దతిని సైతం ఇస్లాం పద్దతిలో చేయడానికి వీలులేదంటూ హూకుం జారీ చేసింది. చనిపోయిన వారి సమాధులపై ఖురాన్ సూక్తులు రాయటం నిషేధించింది.

అహ్మద్ దురానీ పాలనకాలంలో వీరందరిని సామూహికంగా ఉరి తీయమని ఆయన ఆదేశించాడు. దాంతో వేలాది మంది హజారాలు షియా దేశమైన ఇరాన్ చేరుకున్నారు. కొంతమంది పర్వత ప్రాంతాలకు చేరి అక్కడే నివాసం ఉంటున్నారు. అయితే తాజాగా దేశం మళ్లీ తాలిబన్ల వశం కావటంతో మరోసారి వీరంతా తమ భవిష్యత్ పై ఆందోళన చెందుతున్నారు. వీరి జనాభా దేశ వ్యాప్తంగా దాదాపు 30 నుంచి 40 లక్షల వరకు ఉంటుందని అంచనా.ఇది దేశ జనాభాలో దాదాపు 12 శాతానికి సమానం.

ఈ మధ్య కాలంలో తాలిబన్లు తమ దేశంలో నివసించే మైనారిటీలకు వ్యతిరేకం కాదని ప్రకటించారు. ఎవరైన మా దేశంలో సురక్షితంగా ఉండవచ్చని దోహ సమావేశంలో హమీ ఇచ్చారు. అయితే వారి మాటలను నమ్మడానికి తాము సిద్దంగా లేమని కొంతమంది హజారాలంటున్నారు. తమ నేత అబ్దుల్ మజారీ విగ్రహన్ని కూలగొట్టిన తాలిబన్లు. మమ్మల్ని మాత్రం ప్రశాంతంగా ఉండనిస్తారా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ( అబ్దుల్ మజారీ ప్రముఖ హజారీ నాయకుడు 1996 లో తాలిబన్లు ఇతడిని ఉరి తీశారు.) షరియా చట్టం పేరుతో మమ్మలి వేధిస్తారని భయపడుతున్నారు.

తాజాగా తాలిబన్ల పాలనలో ఐసిస్ తీవ్రవాదులు కూడా హజారాలపై దాడులకు దిగే అవకాశం ఉన్నట్లు అనుమానాలున్నాయి. ఎందుకుంటే ఐసిస్ తీవ్రవాదులు కూడా సున్నీ మతాచారాలను పాటిస్తారు. కాబట్టి భవిష్యత్ లో మరోసారి హజారాలు ఇటు తాలిబన్లకు, అటు ఐసిస్ తీవ్రవాదులకు లక్ష్యంగా మారే అవకాశం ఉంది. అయితే వీరు ఎదురు తిరిగి పంజ్‌షీర్ తిరుగుబాటు దారులతో కలిస్తే దేశంలో మరోమారు అంతర్యుద్దం చెలరేగే పరిస్థితులు స్ఫష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే హజారాలకు షియా దేశం ఇరాన్ కావాల్సినంత సహయం అందించడానికి సిద్దంగా ఉంది. ఇప్పటికే ఇరాన్ మిలిషియా సిరియా, ఇరాక్ లో ఐసిస్ తీవ్రవాదులను చావు దెబ్బ తీసింది. మరోసారి సున్నీ పాలకులు అప్ఘాన్‌లోని షియా హజారాలను లక్ష్యంగా చేసుకుంటే టెహ్రన్ తమకు పట్టనట్లు ఉంటుందని అనుకోలేము.

Advertisement

Next Story

Most Viewed