Ap: యువతకు గుడ్ న్యూస్: నేషనల్ వాలీబాల్ టోర్నీలకు డేట్ ఫిక్స్

by srinivas |
Ap: యువతకు గుడ్ న్యూస్: నేషనల్ వాలీబాల్ టోర్నీలకు డేట్ ఫిక్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ యువత(AP youth)కు గుడ్ న్యూస్ లభించింది. రాష్ట్రంలో క్రీడల(Sports)ను పోత్రహిస్తున్న ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. జనవరి 7 నుంచి 13 వరకూ సీనియర్ నేషనల్ వాలీబాల్ టోర్నీలు(Senior National Volleyball Tournaments) నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడ(Vijayawada) నగరంలో వాలీబాల్ జట్టు ఎంపిక ప్రక్రియ చేపట్టింది. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవినాయుడు(SAP Chairman Ravi Naidu) క్రీడలపై కీలక వ్యాఖ్యలు చేశారు. క్రీడల పట్ల గత ప్రభుత్వం అవలంభించిన తీరుపై మండిపడ్డారు. వైఎస్ జగన్(Ys Jagan) హయాంలో వాలీబాల్ క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. జాతీయ స్థాయి పోటీలకు క్రీడాకారులను ప్రోత్సహించలేదని చెప్పారు. అయినా స్వయంశక్తితో వాల్ బాల్ క్రీడాకారులు పథకాలు సాధించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో కొత్త క్రీడా పాలసీ(New Sports Policy)ని తీసుకొచ్చారని తెలిపారు. క్రీడాకారుల భవిష్యత్తే తమకు ముఖ్యమని, ఎట్టి పరిస్థితుల్లో రాజీపడమని రవినాయుడు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed