కరోనా కేసులు తగ్గించడంలో ఇండియా కృషి భేష్ : WHO

by vinod kumar |
కరోనా కేసులు తగ్గించడంలో ఇండియా కృషి భేష్ : WHO
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కేసులు తగ్గించడంలో భారత్ తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అదనోమ్ తెలిపారు. శుక్రవారం స్విజ్జర్లాండ్ జెనెవా కేంద్రంగా ఆన్‌లైన్ బ్రీఫింగ్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

భారత్ చేపడుతున్న చర్యలను అన్ని దేశాలు ఫాలో అయితే కరోనా వైరస్‌ను సులువుగా జయించి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించగలమని పేర్కొన్నారు. అంతేకాకుండా, కరోనా నియంత్రణ చర్యలతో పాటు వ్యాక్సినేషన్‌ను ఉపయోగిస్తే మంచి ఫలితాలను రాబట్టవచ్చునని టెడ్రోస్ తెలిపారు.

Advertisement

Next Story