మరో పదేండ్ల వరకు కరోనా : డబ్ల్యూహెచ్ఓ

by vinod kumar |
మరో పదేండ్ల వరకు కరోనా : డబ్ల్యూహెచ్ఓ
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడిప్పుడే అగ్రరాజ్యంలో కేసులు తగ్గుముఖం పడుతుండగా, భారత్ , రష్యాల్లో కేసులు పెరుగుతూ వస్తున్నాయి. దీనిపై డబ్ల్యూహెచ్వో డైరక్టర్ జనరల్ టెడ్రెస్ అధ్నామ్ గ్యాబ్రియోసిస్ హెచ్చరించారు.

కరోనా ప్రభావం మరో పదేండ్ల పాటు ఉంటుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) సంస్థ ప్రకటించింది. వైరస్ వ్యాప్తి కారణంగా గత కొన్నాళ్ళుగా అనేక కార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా స్తంభించిపోయాయి. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అవుతున్నాయి. చాలా మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇప్పటికీ ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రావడానికి భయపడుతున్నారు.

ఇటీవల కరోనా వైరస్‌పై డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ టీమ్ అత్యవసరంగా సమావేశమయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టెడ్రోస్ మాట్లాడుతూ..’ కరోనా మహమ్మారి ప్రభావం మరో పదేండ్ల పాటు ఉంటుంది. మాస్క్‌లు ధరించడం, శానిటైజర్ల వాడకం, భౌతిక దూరం పాటించడం, సామూహిక ప్రదేశాలను మూసివేయడం వంటి చర్యలను కొనసాగించాలని సూచించారు. ఇటువంటి వ్యాధులు శతాబ్దానికి ఒకసారి పుట్టుకొస్తాయని వెల్లడించారు. వాటి ప్రభావం దశాబ్దాల పాటు కొనసాగుతుందని ఆయన స్పష్టంచేశారు.

Advertisement

Next Story

Most Viewed