కరోనాపై డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన, ఆశాభావం

by sudharani |
కరోనాపై డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన, ఆశాభావం
X

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తునే.. కట్టడి చేయడం సాధ్యమేనని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇది ఇలా ఉండగా ప్రపంచ వ్యాప్తంగా మూడు నెలల వ్యవధిలో దాదాపు 16 వేల మంది మృతి చెందగా.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగు లక్షలకు చేరువైంది. ఈ తరుణంలోనే డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ ట్రెడ్రోస్ అధనోమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతేడాది డిసెంబర్‌లో ఈ వైరస్ వెలుగులోకి వచ్చిందన్నారు. కాగా, 67 రోజుల వ్యవధిలో ప్రపంచ వ్యాప్తంగా లక్ష మందికి వ్యాపించిన ఈ వైరస్.. మరో 11 రోజుల్లోనే 2 లక్షలకు చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత కేవలం నాలుగు రోజుల్లోనే మూడు లక్షల మందిని వైరస్ తాకిందని వెల్లడించారు. అయినా, ఇంకా బయటపడని కేసులు కూడా ఉన్నాయని ట్రెడ్రోస్ కుండ బద్దలు కొట్టారు. ప్రస్తుతానికి వైరస్ ప్రభావం ఉన్నవారికి అన్ని దేశాలు చికిత్స అందిస్తున్నాయని ఆయన గుర్తుచేశారు. కేవలం చికిత్సకే పరిమితం కాకుండా.. కరోనాపై అటాక్ చేయాలని ఆయన అన్ని దేశాలకు పిలుపునిచ్చారు. ఇప్పటివరకు ఏ మందు కూడా కరోనాను నయం చేయలేదని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ విరుగుడు మందు కోసం ప్రయత్నాలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయని ట్రెడ్రోస్ స్పష్టం చేశారు.

Tags: WHO Chief Tredros Adenom, comments, carona virus

Advertisement

Next Story

Most Viewed