షార్ట్ ఫిలిమ్స్ ఆహ్వానిస్తున్న ‘డబ్య్లూహెచ్‌వో’

by vinod kumar |   ( Updated:2020-10-24 00:39:41.0  )
షార్ట్ ఫిలిమ్స్ ఆహ్వానిస్తున్న ‘డబ్య్లూహెచ్‌వో’
X

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్య్లూహెచ్‌వో).. ‘హెల్త్ ఫర్ ఆల్ ఫిల్మ్ ఫెస్టివల్’ కోసం ప్రపంచవ్యాప్తంగా ఇండిపెండెంట్ ఫిల్మ్‌మేకర్స్, ప్రొడక్షన్ కంపెనీస్, ఎన్జీవోస్, కమ్యూనిటీస్, స్టూడెంట్స్, ఫిల్మ్ స్కూల్స్ నుంచి ఒరిజినల్ షార్ట్ ఫిలిమ్స్‌ను ఆహ్వానిస్తోంది. డబ్ల్యూహెచ్‌వో గత సంవత్సరమే ఈ ఫెస్టివల్‌ను ప్రారంభించగా.. ప్రస్తుతం రెండో ఫిల్మ్ ఫెస్టివల్ కోసం ఎంట్రీలను కోరుతోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నో హెల్త్ ఇష్యూస్ మానవ సమాజాన్ని భయపెడుతున్నాయి. కరోనా పాండమిక్ కారణంగా చాలా మంది మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యారు. ఈ తరుణంలోనే మనం మానసికంగా దృఢంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కరోనా కంటే.. భయంతోనే చాలా మంది చనిపోయారన్నది వాస్తవం. ఈ క్రమంలోనే పబ్లిక్ హెల్త్ ఇష్యూస్, దాని చుట్టూ ఉన్న ప్రాబ్లెమ్స్, ప్రజల్లో ఏయే అనారాగ్యాలకు అవగాహన ఎలా కల్పించాలి? ఇలాంటి అంశాలను బేస్ చేసుకుని షార్ట్ ఫిల్మ్స్, వీడియోస్ రూపొందించొచ్చు. మొదటి ఫిల్మ్ ఫెస్టివల్‌కు 110 దేశాల నుంచి 1300 ఎంట్రీలు వచ్చాయి. ప్రస్తుతం మొత్తంగా మూడు కేటగిరీల్లో ఎంట్రీస్ పంపొచ్చు.

యూనివర్సల్ హెల్త్ కవరేజ్: మెంటల్ హెల్త్, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, యూహెచ్‌సీ స్టోరీస్ ఈ కేటగిరీలోకి వస్తాయి.

హెల్త్ ఎమర్జెన్సీ: ఇందులో హెల్త్ ఎమర్జెన్సీస్‌కు సంబంధించిన షార్ట్ ఫిలిమ్స్ ఉంటాయి. కొవిడ్ 19, ఎబోలా వీటికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. హ్యుమానిటేరియన్ క్రైసిస్‌ను బేస్ చేసుకుని కథలు అల్లుకోవచ్చు.

బెటర్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్: న్యూట్రిషన్, శానిటైజేషన్, పొల్యూషన్ వంటి ఆంశాల ఆధారంగా.. ఎన్విరాన్‌మెంటల్, సోషల్ డిటర్మినెంట్స్ కోణంలో సినిమాలు తీయడం. ఇక రూరల్ ఏరియాస్‌లో 100లో 70 మందికి పైగా శానిటైజేషన్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని కోట్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఇవన్నీ కూడా పొట్టి సినిమాలకు ముడిసరుకే. హెల్త్ ప్రమోషన్స్, హెల్త్ ఎడ్యుకేషన్ కూడా ఈ కోవలోకే వస్తాయి.

ఈ షార్ట్ ఫిలిమ్స్ లేదా ఫిక్షన్ ఫిలిమ్స్.. మూడు లేదా 8 నిమిషాలు నిడివిలో రూపొందించాలి. సోషల్ మీడియా కోసం రూపొందించే షార్ట్ వీడియోలు లేదా యానిమేషన్ వీడియోల నిడివి 1 నుంచి 5 నిమిషాలు వరకు ఉండొచ్చు. స్టూడెంట్ ప్రొడ్యూస్డ్ ఫిలిమ్స్, హెల్త్ ఎడ్యుకేషన్ ఫిలిమ్స్, సోషల్ మీడియా కోసమే ప్రత్యేకంగా రూపొందించే షార్ట్ వీడియోల కోసం మరో మూడు ప్రత్యేక బహుమతులున్నాయి.

అక్టోబర్ 24, 2020 నుంచి జనవరి 30, 2021 వరకు తమ తమ వీడియోలను సబ్మిట్ చేయొచ్చు. కాగా జనవరిలో న్యాయనిర్ణేతలు, జ్యూరీ మెంబర్ల వివరాలు వెల్లడిస్తామని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed