జులై తర్వాత కొవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్‌వో ఆమోదం

by Shamantha N |
జులై తర్వాత కొవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్‌వో ఆమోదం
X

న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) జులై నుంచి సెప్టెంబర్ కాలంలో ఆమోదించే అవకాశముంది. 13 దేశాల్లో తమ టీకా ఎమర్జెన్సీ అనుమతులను పొందిందని, మరికొన్ని దేశాల్లోనూ ఈ అనుమతులు లభించనున్నట్టు భారత్ బయోటెక్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ కోసం 90శాతం డాక్యుమెంట్లను డబ్ల్యూహెచ్‌వోకు సమర్పించామని వివరించింది. మిగతా వాటిని జూన్‌లో సమర్పించనున్నట్టు తెలిసిన ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఫలితంగా జూలై నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో డబ్ల్యూహెచ్‌వో నుంచి ఆమోదం లభించవచ్చునని కంపెనీ వెల్లడించింది.

ప్రపంచదేశాలు ట్రావెల్, టూరిజాన్ని మళ్లీ ప్రోత్సహిస్తున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర దేశాలు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ వ్యాక్సి్న్‌ను ఆమోదిత టీకాల జాబితాలో చేర్చకపోవడంపై భారతీయ విద్యార్థుల్లో ఆందోళనలు నెలకొంటున్నాయి. యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఐరోపా సమాఖ్య దేశాలు కొవాగ్జిన్‌ను తమ ఆమోదిత టీకాల జాబితాలో చేర్చలేవు. దేశాల ఆమోదిత టీకాలు వేసుకున్నవారినే టాప్ యూనివర్సిటీలు అనుమతినిస్తున్నట్టు సమాచారముంది. ఈ నేపథ్యంలోనే కొవాగ్జిన్ వేసుకున్న భారత విద్యార్థులు ఆయా దేశాలకు వెళితే 14 రోజుల క్వారంటైన్ తప్పదని నిపుణులు చెబుతున్నారు. ఆగస్టు, సెప్టెంబర్‌లలో ఫారీన్ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి.

Advertisement

Next Story