థాంక్యూ ఇండియా

by Shamantha N |   ( Updated:2021-01-23 05:43:02.0  )
థాంక్యూ ఇండియా
X

న్యూఢిల్లీ: కరోనాపై ప్రపంచ పోరులో భారత నిర్వహిస్తున్న కీలకపాత్రపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రశంసలు కురిపించింది. దక్షిణాసియాలోని పొరుగుదేశాలకు, బ్రెజిల్, మొరాకోలకూ భారత్ టీకాలను సరఫరా చేస్తున్నది. దక్షిణాఫ్రికాకూ వ్యాక్సిన్‌లు త్వరలో అందనున్నాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయెసస్ ట్వీట్ చేశారు. కరోనా మహమ్మారి నుంచి బయటపడటానికి చేస్తున్న కృషికి భారత్, దేశ ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ‘విజ్ఞానాన్ని పంచుకుంటూ అందరం కలిసి పోరాడితే మహమ్మారికి చెక్ పెట్టవచ్చునని, ఎంతోమంది జీవితాలను, జీవనోపాధిని కాపాడవచ్చును’ అని అభిప్రాయపడ్డారు.

ధన్యవాదాలు: బ్రెజిల్ ప్రెసిడెంట్

టీకాల సరఫరాపై భారత్‌కు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ధన్యవాదాలు తెలిపారు. ‘నమస్కార్. కరోనా మహమ్మారిని కలిసి ఎదుర్కోవడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీలాంటి భాగస్వామిని కలిగి ఉన్నందుకు బ్రెజిల్ సంతోషపడుతున్నది. భారత్ నుంచి బ్రెజిల్‌కు టీకాలు పంపిస్తున్నందుకు కృతజ్ఞతలు. ధన్యవాద్!’ అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed