- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
శ్వేత పత్రం విడుదల చేయాలి: రఘునందన్ రావు
దిశ, సిద్దిపేట: సిద్దిపేట మున్సిపాలిటికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులపై శ్వేత పత్రాన్ని రానున్న మున్సిపల్ ఎన్నికల కన్నా ముందే మంత్రి హరీశ్ రావు విడుదల చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. లేదంటే సిద్దిపేటకు కేంద్రం ఇచ్చిన నిధులపై బీజేపీ తరఫున తామే శ్వేత పత్రం విడుదల చేస్తామని తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…సిద్దిపేటలో చాలా కాలంగా పేద ప్రజలు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. త్వరలో సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలు ఉన్న కారణంగానే ఆదరాబాదరాగా ఇండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారని తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోందని ,అనేక సాప్ట్ వేర్ కంపెనీలు చతికిల పడ్డాయని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో సిద్దిపేటలో ఐటీ పార్కు కోసం శంకుస్థాపన చేయడం సరైన సమయం కాదని సూచించారు. అభివృద్ధికి బీజేపి పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీలో జరగుతున్న పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదనీ ఆరోపించారు. పారదర్శకత లోపించిందని , అవినీతి పెరిగినట్లు ప్రజలు భావిస్తున్నారని వెల్లడించారు.