- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Digital marketing :సోషల్ మీడియాలో క్లిక్ అయితే లక్షల్లో ఆదాయం.. ఎలా అంటే ?
దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం ఆన్‌లైన్ వేదికగా వివిధ రంగాల్లో ఎంతోమంది సక్సెస్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే వాళ్లను గమనిస్తున్న వ్యక్తులు కూడా అదే బాటలో నడిచి ఆన్‌లైన్‌లో తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. వారికి రాత్రికి రాత్రే విజయం దక్కలేదు, వాస్తవానికి ఆంత్రప్రెన్యూర్‌షిప్ మార్గం అంత సులభమేమి కాదు. కానీ నమ్మకముంచి ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమేనని నిరూపించిన వ్యక్తులెందరో. ఈ నేపథ్యంలోనే.. కొందరు జీరో నుంచి మొదలుపెట్టి హీరోగా ఎదిగితే, మనలో ఒకరిగా ఉన్న వ్యక్తులే ఈరోజు సెలబ్రిటీలుగా మనముందు నిల్చున్నారు. అదేవిధంగా చేతిలో రూపాయి లేకుండా ప్రయత్నించి.. నేడు లక్షలు సంపాదిస్తూ లక్షణంగా జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు మన బిజినెస్ ఐడియా ఏంటి? హాటెస్ట్ వ్యాపార ఆలోచనలేవి? వాటి నుంచి ఎంత త్వరగా డబ్బులు సంపాదించుకోవచ్చు? వంటి అంశాలను తెలుసుకుందాం.
డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ :
బిజినెస్‌ని ప్రమోట్ చేసుకోవడానికి, ప్రజలకు చేరువ చేయడానికి కంపెనీలు ప్రధానంగా ప్రకటనల మీద ఆధారపడతాయి. ఇదివరకు పోస్టర్స్ సహా మౌత్, మైక్ పబ్లిసిటీపై కంపెనీలు కాన్సంట్రేట్ చేసేవి. కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో మారుతున్న మార్కెటింగ్ అవసరాలను తీర్చడానికి ‘డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ’లు పుట్టుకొచ్చాయి. ఇవి కొత్త సాంకేతికత, ఆధునిక మార్కెటింగ్ టెక్నిక్‌లతో కలిసి గ్రాఫిక్ డిజైన్, కాపీ రైటింగ్‌ను అందిస్తాయి. మల్టీ లేదా సింగిల్-చానల్ మార్కెటింగ్ ద్వారా డిజిటల్ ఏజెన్సీలు ఆన్‌లైన్‌లో వినియోగదారులను అట్రాక్ట్ చేస్తుంటాయి.
వెబ్‌సైట్‌లు, బ్లాగ్‌లు, ఈ-మెయిల్, సోషల్ మీడియా మరిన్ని ప్లాట్‌ఫామ్స్‌లోని కస్టమర్‌లకు ఆయా ప్రొడక్ట్స్ చేరువ చేస్తాయి. డిజిటల్ మార్కెటింగ్ భవిష్యత్తు ఏజెన్సీల దిశగా ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. అందువల్ల ప్రస్తుతం ఇదో మంచి బిజినెస్ అవకాశమని చెప్పొచ్చు. మీకు డిజిటల్ మార్కెటర్‌గా కొంత అనుభవముంటే చాలు ప్రతిభావంతులైన ఇండివిడ్యువల్స్‌ను రిక్రూట్ చేసుకుని సొంత టీమ్‌ను ఏర్పాటు చేసుకుని, ప్రాజెక్ట్స్ పొందవచ్చు. అయితే పాండమిక్ తర్వాత పరిస్థితులు మారిపోయినందున వివిధ నగరాలు లేదా దేశాల నుంచి కూడా మార్కెటర్స్‌ను నియమించుకోవచ్చు. రిమోట్‌గా పనిచేయడం వల్ల ఆఫీస్ సెటప్ కూడా అవసరం లేకుండా ఇంట్లో నుంచే ఏజెన్సీ పనులు నిర్వహించవచ్చు. అంతేకాదు ఏజెన్సీ వల్ల కొంతమందికి ఉపాధి కల్పించారన్న సంతృప్తి కూడా ఉంటుంది.
బ్లాగింగ్ అండ్ ఇన్‌ఫ్లుయెన్సింగ్..
రాయడంలో లేదా ఏదైనా ఎక్స్‌ప్లెయిన్ చేయడంలో పట్టు ఉంటే బ్లాగింగ్ ది బెస్ట్ ఆప్షన్. అయితే అందరూ పరిగణిస్తున్నట్లుగా ఇది రైటింగ్‌కు మాత్రమే పరిమితం కాదు. ఇది ఒక పూర్తిస్థాయి వ్యాపార అవకాశం. ఇందులో ఒక అంశా(డొమైన్)నికి సంబంధించిన డిజిటల్ మార్కెటింగ్, అమ్మకాల గురించి లోతైన అవగాహన ఉంటుంది. అదేవిధంగా కంటెంట్ మార్కెటింగ్ నైపుణ్యాల ఆధారంగా భవిష్యత్తు వ్యాపారాన్ని నిర్మించవచ్చు. అయితే బ్లాగింగ్ అనేది రిస్క్ ఫ్రీ- ట్రయల్. ఇక్కడ విఫలమైతే కోల్పోయేది ఏమీ ఉండదు. బ్లాగింగ్ కోసం పూర్తి సమయం కేటాయిస్తారా? లేదా ఉద్యోగంతోపాటు పార్ట్‌టైమ్ చేస్తారా? అనేది మనపై ఆధారపడి ఉంటుంది.
ఇక అతి ముఖ్యమైన విషయమేమిటంటే మీరు ఎంపిక చేసుకునే అంశం మీకు కంఫర్ట్‌గా ఉండాలి. ఆ అంశంపై మరింత నేర్చుకోవడం, దాన్ని రీడర్స్‌తో పంచుకోవడం పట్ల కూడా మక్కువ కలిగి ఉండాలి. కుకింగ్, పేరెంటింగ్, గాసిప్, జోకులు, విమర్శలు, ఫ్యాషన్, మార్కెటింగ్, ఫైనాన్స్, ట్రావెల్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, సాఫ్ట్‌వేర్ లాంగ్వేజ్ అది ఏదైనా కావచ్చు. బ్లాగర్‌గా మీ ఇన్‌ఫ్లుయెన్స్ ఇతర చానెళ్లలో విస్తరించవచ్చు. ఉదాహరణకు.. మీరు యూట్యూబ్‌లో వీడియోలు చేయడం ప్రారంభించి అక్కడ చానెల్‌ని మానిటైజ్ చేయవచ్చు. లేదా మీ బ్లాగ్ ఆసక్తికరమైన ప్రదేశాల కోసం ఫోటోలు వంటి విజువల్ కంటెంట్ అద్భుతంగా ఉంటే మీరు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ప్రారంభించి ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారొచ్చు. బ్లాగర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ వంటి పదాల్లో తేడా ఉన్నా, చేసే పనుల్లో పెద్దగా తేడా ఏం ఉండదు. వాస్తవానికి బ్లాగర్‌గా ప్రారంభించి, మంచి వీక్షకులను ఆకర్షించినట్లయితే, బ్లాగ్‌ని మానటైజ్ చేయడం కూడా సమస్య కాదన్నది అందరికీ తెలిసిన వాస్తవమే.
ఆన్‌లైన్ ఎడ్యుకేషన్..
‘పాండమిక్’ ఎఫెక్ట్.. విద్య విధానాన్ని శాశ్వతంగా మార్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మహమ్మారికి ముందే ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ట్రెండ్ గుర్తించదగిందే. కానీ ప్రస్తుతం రిమోట్ ఏరియా ప్రజలు కూడా తమకు నచ్చిన అంశాలను డిజిటల్‌గా నేర్చుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే అనేక ఎడ్యు టెక్ కంపెనీలు పుట్టుకురాగా, మరెంతోమంది ఆన్‌లైన్ వేదికగా సొంతగా పాఠాలు బోధిస్తున్నారు. ఆన్‌లైన్‌లో నేర్చుకోవాలనే డిమాండ్ చాలా ఎక్కువగా ఉండగా, టెక్ జ్యూరీ ప్రకారం ప్రపంచవ్యాప్త ఆన్‌లైన్ విద్యా పరిశ్రమ 2025లో 320 బిలియన్ డాలర్లకు పైగా విలువైనదిగా అంచనా వేసింది. ఇక ముందు కూడా ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌కు ఆదరణ పెరుగుతూనే ఉంటుంది.
ఈ అవకాశాన్ని ఎవరైనా మానిటైజ్ చేసుకునే అవకాశముండగా, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్‌ను నిర్మించడం లేదా కంటెంట్ క్రియేటర్స్‌ను ఆహ్వానించడం చేయొచ్చు. అంతేకాదు కోర్సులను కూడా డిజైన్ చేసి చెప్పే అవకాశం కూడా ఉంది. అయితే ప్రస్తుతం పోటీ తీవ్రంగా ఉన్నందున కొత్త విద్యా వేదికను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవడం కాస్త కష్టమైనా పనే అయినా, అసాధ్యమైతే కాదు. ఒక్కసారి ఫ్లోటింగ్ ప్రారంభమైతే, ఇక తిరుగుండదు. అయితే దీనికంటే సొంత కోర్సులను సృష్టించడం సులభమని చెప్పొచ్చు. సమయం ఎక్కువగా తీసుకున్నా నాణ్యత, విలువపై దృష్టి పెట్టడంతో పాటు అభ్యాసకులకు ఉపయోగకరంగా ఉండే సమాచారాన్ని అందించండి. అలా రూపొందించిన మెటీరియల్‌ను ఇప్పటికే ఏర్పాటు చేసిన ప్లాట్‌ఫామ్‌లలో విక్రయించి, ఆదాయం పొందొచ్చు. ఇక వీడియో కంటెంట్‌ని సృష్టించాలనుకుంటే యూట్యూబ్ చానల్ ట్రై చేయొచ్చు. ట్యూషన్ ప్లాట్‌ఫామ్స్‌లోనూ పార్ట్‌టైమ్‌గా పాఠాలు చెప్పుకోవడం కూడా ఉత్తమ ఆదాయమార్గమే.
ఈ-కామర్స్ స్టోర్..
ఈ రోజుల్లో అందుబాటులో ఉన్న సాంకేతికత కారణంగా ఈ-కామర్స్ స్టోర్ ప్రారంభించడం అంత కష్టమేమి కాదు. దీంతో మీరు కొన్ని నిమిషాల్లోనే స్టోర్‌ను సెటప్ చేయవచ్చు. వెబ్‌సైట్ ప్రారంభమైన తర్వాత, కస్టమర్‌లను ఆకర్షించడానికి మీరు మార్కెటింగ్‌పై దృష్టి పెడితే చాలు. ఒకవేళ మీరు ఉత్పత్తులు లేదా సేవలను విక్రయించడానికి ఆందోళన చెందుతుంటే, వస్తువులను మీరే తయారు చేసుకోవాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోండి. సాంప్రదాయ ఆన్‌లైన్ స్టోర్‌ను నడపడానికి ‘డ్రాప్‌షిప్పింగ్ బిజినెస్ మోడల్’ ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.
అనుభవం లేని లేదా అరుదైన ఈకామర్స్ వినియోగదారుల నుంచి కొనుగోళ్ల పరిమాణం భవిష్యత్తులో 160% పెరుగుతుందని 2020 మే, యాక్సెంచెర్ అధ్యయనం వెల్లడించింది. గత సంవత్సరం చాలా మంది ప్రజలు ఆన్‌లైన్ షాపింగ్ సౌలభ్యాన్ని ఉపయోగించుకోగా, కొత్తగా వచ్చిన ఎంతోమంది దానికి మరింత అలవాటు పడుతున్నట్లు వెల్లడైంది. సెప్టెంబర్ 2022 నాటికి 50% ఆన్‌లైన్ ఖర్చు స్మార్ట్‌ఫోన్‌ల ద్వారానే జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ-కామర్స్ స్టోర్‌కు మరింత డిమాండ్ పెరుగుతున్నందున దీన్ని ప్రారంభించడంలో ఎలాంటి నష్టముండదని నిపుణుల అభిప్రాయం. ఇవే కాకుండా, ఎస్ఈవో, గేమ్ డెవలెప్మెంట్స్, ఈ-స్పోర్ట్స్ వంటి సర్వీసెస్ కూడా డిమాండ్ ఎక్కువగానే ఉంది.