- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘గ్లాస్ బ్రిడ్జ్’.. రెడీ ఫర్ టూరిస్ట్స్
దిశ, వెబ్‌డెస్క్ : అత్యద్భుతమైన కట్టడాలకు, ప్రపంచం నివ్వెరపోయే నిర్మాణాలకు ప్రసిద్ధి గాంచిన దేశం చైనా. శిఖరపు అంచుల్లో, కొండల మధ్యలో, భూగర్భంలో.. ఇలా అసాధ్యమనుకున్న ప్రాంతాల్లో అసాధారణమైన నిర్మాణాలతో చైనా ఆర్కిటెక్ట్స్ ఔరా అనిపించారు. అంతేకాదు ఎన్నో గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణాలతోనూ చైనా మిగతా దేశాలకు రోల్ మోడల్‌గా నిలిచింది. మరి గ్లాస్ బ్రిడ్జ్‌పై నడుస్తూ, గాల్లో తేలిపోయే అనుభూతి పొందాలంటే చైనా వెళ్లాలా? అంటే అవసరం లేదు. ప్రస్తుతం ఇండియాలోనూ రెండు గ్లాస్ బ్రిడ్జ్‌లు నిర్మితమవుతుండగా, అందులో ఒకటి త్వరలోనే ప్రారంభం కాబోతుంది.
మనదేశంలో తొలిగా రిషికేష్‌లో ‘గ్లాస్ బ్రిడ్జ్’ నిర్మాణం ప్రారంభం కాగా, రెండో ప్రాజెక్ట్ బిహార్‌లోని నలంద విశ్వవిద్యాలయానికి దగ్గరలో ఉన్న లక్ష్మణ్ జుల ప్రాంతంలో మొదలైంది. అయితే రిషికేష్ గ్లాస్ బ్రిడ్జ్ పనులు ఇంకా కొనసాగుతుండగా, బిహార్ గ్లాస్ బ్రిడ్జ్ మాత్రం 2021లో ప్రారంభం కానుండటం విశేషం. కొండల మధ్య నిర్మించిన ఈ గ్లాస్ బ్రిడ్జ్.. దేశీయ పర్యాటకులనే కాకుండా, విదేశీ పర్యాటకులను సైతం ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. దీంతో పాటు రత్నగిరి హిల్స్‌లో రోప్ వే కూడా ఫిబ్రవరి కల్లా సిద్ధమవుతుందని బిహార్ సీఎం నితీష్ కుమార్ ఇటీవలే వెల్లడించారు. ఈ బ్రిడ్జ్‌పై మొత్తంగా 18 గ్లాస్ క్యాబిన్స్ ఉండగా, ఒక్కో క్యాబిన్‌లో 8 మంది టూరిస్ట్‌లు కూర్చునే అవకాశం ఉంటుంది.