- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్నేహితుడి బర్త్‌డేకు కేక్ కొనగోలు చేసి వస్తుండగా.. అంతలోనే..
దిశ, చేవెళ్ల : గుర్తుతెలియని వాహనం ఢీకొని ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మండలం దేవుని ఎర్రవల్లి గ్రామానికి చెందిన జయవర్ధన్ (16), విష్ణువర్ధన్ (16) కర్రోళ్ళ ప్రసాద్ (16)లు స్నేహితుడి పుట్టినరోజు ఉండడంతో కేక్ కొనుగోలు చేసేందుకు బైక్‌పై చేవెళ్ల కి వెళ్లారు. చేవెళ్ల లో కేక్ కొనుగోలు చేసుకుని తిరుగు ప్రయాణంలో బైక్‌పై వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది.
దీంతో అక్కడికక్కడే ముగ్గురి ప్రాణాలు వదిలారు. అప్పటివరకు కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన ముగ్గురు యువకులు ఉన్నట్టుండి మృత్యువాత పడ్డారు అనే సమాచారం అందుకున్న వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న చేవెళ్ల సీఐ విజయభాస్కర్‌రెడ్డి సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు.